మెడిటేషన్స్-8

ఈ మాటలు నాకు చాలా నచ్చాయి. మనం పూర్తిగా పాటించగలిగినా, పాటించలేకపోయినా కూడా మనకై మనం పెట్టుకున్న ఆ శీలపారమితలోనే మనకి నిజమైన తృప్తి, ధైర్యం, నిలకడ అని మనం గుర్తుపెట్టుకోవాలి. శీలవిద్య మనం ట్యూషన్ లాగా పదే పదే చెప్పించుకోవలసింది కాదు. పదే పదే మనకు మనం చెప్పుకోవలసింది.

మెడిటేషన్స్-7

స్పష్టంగా ఉంది కదా. దేవుళ్ళతో కలిసి జీవించు. తెల్లవారుజామునే ఎందుకు నిద్రలేవాలంటే దేవుళ్ళతో కలిసి జీవించడం ఎలా ఉంటుందో ఆ వేళల్లో నీకు మరింత బాగా అర్థమవుతుంది కాబట్టి.

మెడిటేషన్స్-6

ఒకడు నిన్ను ఏదో అంటాడు, లేనిపోని ఆరోపణలు చేస్తాడు, అభాండాలు వేస్తాడు. వాడు అవి చెయ్యకుండా నువ్వు ఆపలేవు. కాని వాటికి ప్రతిస్పందించకుండా ఉండటం మాత్రం పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. అంటే మనసులో  బాధపడి పైకి వ్యక్తం చెయ్యకుండా ఉండటం కాదు. అసలు మనసులోనే కించిత్ క్లేశానికి కూడా తావీయకపోవడం అన్నమాట.