ఆదర్శ ఉపాధ్యాయుడు

మరీ ముఖ్యంగా, ఆయన చివరి పదేళ్ళ కాలంలో ఆయన్ని చాలా దగ్గరగా చూసినవాళ్ళు కలాం ఎన్నటికీ స్వయంగా చెప్పుకోడానికి ఇష్టపడని ఎన్నో అపురూపమైన సంగతుల్ని మనముందుకు తెస్తున్నారు. ఆ విశేషాలు మనం ప్రతి ఒక్కరం తెలుసుకోదగ్గవి, ముఖ్యం, మన పిల్లలతో పదే పదే చదివించదగ్గవి.