వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో తూర్పుగోదావరి జిల్లాలో శరభవరంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. కొన్నాళ్ళు రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంటులో పనిచేసాక, 1987లో ఆంధ్రప్రదేశ్ గిరిజనసంక్షేమశాఖలో చేరిన మీదట వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2013లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు పదోన్నతి పొందాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసారు. గిరిజనసంక్షేమశాఖ సంచాలకులుగా 2022లో పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నారు. ఆయన ఇప్పటిదాకా దాదాపు 40 గ్రంథాలు వెలువరించారు. చినవీరభద్రుడు ఔత్సాహిక చిత్రకారుడు కూడా. ఆయన రచనలు, ప్రసంగాలు, పుస్తకాలు, సమీక్షలు, పాల్గొనే సమావేశాల వివరాలతో పాటు ఆయన గీసే చిత్రలేఖనాలు కూడా ఈ బ్లాగులో ఎప్పటికప్పుడు చూడవచ్చు.
Awash with life. Alive with color. May your creative ink never run dry.