'ఓవర్ కోటు' కథ ని ఎన్ని ఎన్ని విధాలుగానైనా చదవవచ్చు, ఎన్ని రకాలుగానైనా వ్యాఖ్యానించవచ్చు. డార్క్ రొమాంటిసిజం మొదలుకుని మాజికల్ రియలిజందాకా ప్రతి కళా ఉద్యమానికీ దాన్ని ఉదాహరిస్తూ పోవచ్చు.
ఇంతకీ విద్య మంచిదేనా?
మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.