ఇది కదా, ఒక కవిని కన్నందుకు, ఆ ఊరికి లభించే భాగ్యం! మరో కవి ఎవరేనా ఉన్నారా? ఇలా ఒక మేఘాన్ని తన ఊరికి ఆహ్వానించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండీ మరీ చూపించడానికి ఉత్సాహపడ్డ కవి!
ఆషాఢ మేఘం-20
పూర్వమేఘంలోని ఈ నలభై-యాభై పద్యాల్లో కాళిదాసు సంస్కృతకవిత్వాన్ని మొదటిసారిగా పొలాలమ్మట తిప్పాడు, అడవుల్లో, కొండల్లో విహరింపచేసాడు. గ్రామాల్లో రైతుల్ని, పథికవనితల్నీ పరిచయం చేసాడు.
ఆషాఢ మేఘం-19
కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.
