తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.
ఆషాఢమేఘం-4
కాని వానాకాలం రాముడిలోని మనిషి బయటపడే కాలం. కాబట్టి రాముడే 'చూడు మనం చెప్పుకుంటున్న ఆ వానాకాలం సమీపించింది' అని అనడంలో కూడా గొప్ప ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఆ వర్షర్తువర్ణన మొత్తం ఒక భావుకుడైన మానవుడు, అసలే రసార్ద్రహృదయుడు, మరింత రసార్ద్రభరితుడై చేసిన వర్షస్తోత్రంలాగా మనకి వినిపిస్తుంది.
ఆషాఢమేఘం -3
ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక అభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు.
