దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.

కొంత పొగ, కొంత కాంతి

ఋతుపవనమేఘాలు తమ నేలల్ని తాకినప్పుడు పూర్వకాల సంగం కవులు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం కవులు సంతోషంతో పులకించిన పలవరింతల్ని కాళిదాసు మేఘసందేశంగా తీర్చిదిద్ది భారతీయ ఋతుపవనాన్ని ఒక అజరామర కావ్యంగా మార్చేసాడు.

రంగులవంతెన

మేఘావృతమైన ఆకాశం. నా హృదయమింకా మేఘసందేశ కావ్యం చుట్టూతానే పరిభ్రమిస్తున్నది. ఆ కావ్యం మనమీద జల్లే మంత్రమయసుగంధం ఒకపట్టాన వదిలేది కాదు. టాగోర్ నే చూడండి. ఆయన జీవితమంతా ఆ కావ్యాన్ని స్మరిస్తూనే వున్నాడు. ఎంతగా అంటే, తనను తాను 'ఆలస్యంగా, ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా' చెప్పుకునేటంతలా.