పుస్తక పరిచయం-29

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశ కావ్యం గురించి ఇది ఎనిమిదవ ప్రసంగం. ఇప్పటిదాకా 40 శ్లోకాలు, అంటే, కావ్యంలో మూడవవంతు పూర్తయింది. ఇవాళ 41-49 దాకా శ్లోకాల గురించి నా భావాలు పంచుకున్నాను. ఈ ప్రసంగం ఇక్కడ వినవచ్చు,

పుస్తక పరిచయం-24

పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశ కావ్యం గురించి ఇది మూడవ ప్రసంగం. కిందటి ప్రసంగంలో పూర్వమేఘంలో ఏడవ శ్లోకం దాకా చదువుకున్నాం. ఈ ప్రసంగంలో ఎనిమిది నుంచి పదిహేడుదాకా మొత్తం పది శ్లోకాల్ని పరామర్శించాను.

ఆషాఢమేఘం-23

కాకపోతే ఆ ఉజ్జయిని నగరంలో గతం, వర్తమానం అన్నీ ఉదయనకథాగానమే. మరో విశేషం లేదు. ఆ ఉదయనుడు ఎవరో గాని, మన తీరికసమయాల్ని ఎంతగా లోబరచుకున్నాడు! లేకపోతే, ఈ ఆషాఢప్రభాతాన నేనిట్లా కూచుని పరగడుపున మళ్ళా ఆ కథలే మీతో ముచ్చటించడమేమిటి!