నీ దృష్టిలో ప్రేమ ఒక అనుగ్రహం. అది పోరాడి సాధించేది కాదు, పారాడి నిలబెట్టుకునేదీ కాదు. అది నిలువెల్లా వణికిపోతూ, మన చేతుల్లోని కాఠిన్యానికి ఆ శిరీష కుసుమదళాలు ఎక్కడ కందిపోతాయోనన్నంత ఆతృతగా, వినయంగా, మోకరిల్లి మరీ మన జీవితాల్లోకి తెచ్చుకోవలసింది. ..
వియోగ బాధ, విరహజ్వాల
ఆయనెప్పుడూ అనేవారు: 'ఈశ్వరుడి గురించి కాకపోతే ఏ మాటలైనా వృథా. ఇక ఈశ్వరుడి మాటలెట్లానూ బిగ్గరగా మాట్లాడుకునేవి కానేకావు.'
