యుద్ధకవి

యుద్ధమంటే ఎలా ఉంటుందో చూడని వాడు, యుద్ధం తన జీవితాన్నీ, తన వాళ్ళ జీవితాన్నీ అతలాకుతలం చెయ్యడమెలా ఉంటుందో తెలియనివాడు మాత్రమే తుపాకుల్నీ, బేయొనెట్లనీ, బుల్లెట్లనీ కీర్తిస్తూ కవిత్వం చెప్తాడు. కాని నిజంగా యుద్ధంలో మునిగిపోయినవాడు రాసే కవిత్వమలా ఉండదు. అదెలా ఉంటుందో చూడాలంటే దు-ఫు లాంటివాడి కవిత్వం చదవాలి.

దు-ఫు

దు-ఫు పేరు మీద లభ్యమవుతున్న దాదాపు పధ్నాలుగు వందల కవితల్లోంచి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎంపిక చేసి, అనువదించిన ఈ నలభై కవితలూ దు-ఫు జీవించిన కాలాన్నీ, సుఖదుఃఖాల్నీ తెలుగుపాఠకులకు కొంతేనా పరిచయం చెయ్యగలవు. ఈ చిన్నపుస్తకంతో దు-ఫు తెలుగుహృదయాల్లోకి చొరబడగలడని నమ్మవచ్చు.

ఆషాఢ మేఘం-18

తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.

Exit mobile version
%%footer%%