ఆ వెన్నెల రాత్రులు-21

కాని ఒకటి మాత్రం చెప్పగలను. ఇద్దరూ కూడా మన కంటికి కనిపించేదే ట్రూత్ అనరు. ఇద్దరూ కూడా డ్రీమ్ టైమ్ లో జీవిస్తుంటారు. కాని ప్రొఫెసరు సేన్ గుప్త డ్రీమ్ లో సృష్టి, స్థితి, లయాలమధ్య తేడా లేదు. కాని అదే మిశ్రా అయితే మీరు దేన్ని అసత్యమన్నా ఒప్పుకుంటాడుగాని, ఇన్ జస్టిస్ ని అసత్యం అంటే  మాత్రం ఒప్పుకోడు. దాంతో ఏదో ఒక రకంగా తలపడాలంటాడు. బట్, అలా తలపడటానికి కావలసిన ఎనర్జీ మాత్రం తనడ్రీమ్స్ నుంచే డ్రా చేసుకుంటాడు

ఆ వెన్నెల రాత్రులు-20

ఆ వేసవికాలపు తెల్లవారుజాముల్లో గాలుల్లో తెల్లదనం, చల్లదనం కలిసి ఉండేవి. ఆ అరుగుల మీద ఇంత చాపనో, బొంతనో పరుచుకుని పడుకున్న మా మీద రాత్రంతా రాలిన రాధామనోహరాల పూల గాలి తియ్యదనం పోగుపడి ఉండేది. తెల్లవారినా ఇంకా దుప్పటి ముసుగుదన్ని పడుకున్న మమ్మల్ని కోకిల లేపేసేది. మామీంచి దుప్పటి లాగేసేది.

ఆ వెన్నెల రాత్రులు-19

ఆమె తన హృదయావేదన అంతా ఆ పాటలో కుక్కిపెట్టి తన శిష్యురాలికి నేర్పి ఉంటుంది. ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు ఆ పాట ఇన్నాళ్ళకు ఇక్కడ ఈ హృదయాల్లోకి వచ్చిపడింది. ఆ కవి వేదనా, ఆ మ్యూజిక్ టీచర్ వేదనా కలిసి ఆ గొంతులో భద్రంగా అంతదూరం ప్రయాణించేయన్నమాట.