నేను తిరిగిన దారులు-4

అరకులోయ దారుల్లో

బొల్ కొబొర్

7

అరకులోయలోనూ, ఆ పరిసరాల్లోనూ ఆ రోజు మేం చాలానే చూసాం. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, గంగమ్మ గుడి, పద్మాపురం గార్డెన్స్‌, పబ్లిక్‌ స్కూల్‌ -కానీ, ఆనాటి మా యాత్రలో మేం నిజంగానే మరవలేనివి హట్టగూడ, కరాయిగూడాను.

పద్మాపురం గార్డెన్స్‌ చూసిన తర్వాత ‘మనం హట్టగూడ పోదాం” అన్నాడు ప్రసాద్‌. ఊళ్లో రెండు ఆటోలు కుదుర్చుకుని అరకు ఊళ్లోంచి కొండదారుల్లోకి ప్రయాణమయ్యాం. ఇరువైపులా ఒలిసెలు, చామలు పండిన చేలల్లోంచి సిల్వర్‌ ఓక్‌ ప్లాంటేషన్ల మధ్యగా అయిదారు కిలోమీటర్ల ప్రయాణం మమ్మల్నొక చక్కని ఆవరణ ముంగిట చేర్చింది.

“ఇది ఆదివాసి అభివృద్ధి సాంస్కృతిక సంఘం’ అనే స్వచ్చంద సేవాసంస్థ. ఊవె గుస్టఫ్‌సన్‌ అనే కెనడా జాతీయుడొకాయన గత ఇరవయ్యేళ్లుగా ఈ ప్రాంతంలో గిరిజనుల్ని  సంఘటితపరిచి భాషాపరిశోధనలో, వయోజనవిద్యలో, తోటల పెంపకంలో, వృత్తినైపుణ్యాల్లో ఎంతో కృషి చేసాడు. ఇది చూపిద్దామనే ఇక్కడికి తీసుకువచ్చాను మిమ్మల్ని! అన్నాడు ప్రసాద్‌.

ఆ చిన్న కొటియాపల్లెలో సాధారణ గిరిజనుల్ని సంఘటితపరిచి, ఆ విదేశీయుడు చేసిన కృషి మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది. మాకు ఆయన్ని కలిసి మాట్లాడే అవకాశాన్ని ప్రసాద్‌ ఏర్పాటుచేసాడు. ఎంతో సౌజన్యంతో ఆయన మాతో ఎన్నో సంగతులు ముచ్చటించాడు. ఆ సంస్థ ఆవరణలో పూలతోటల నర్సరీ, ప్రెస్సు, వడ్రంగం, కుందేళ్ల పెంపకం, స్టోర్సు అన్నీ చూసాం. ఆదివాసి ఒరియా భాషలో వారు ముద్రించిన నిఘంటువులూ, వయోజన విద్యావాచకాలూ, అటవీ ఉత్పత్తుల గురించీ, కాఫీ పెంపకం గురించీ ప్రచురించిన మోనోగ్రాఫులూ, గిరిజనుల కథలూ, పాటల సేకరణలూ చూసేం.

“ఆదిబసి లోకోర్‌ పొరాబ్‌ కత’ అని గిరిజనుల పండగల గురించిన విశిష్టరచనని ఆయన మా ప్రతి ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రతి చొప్పున కానుకగా ఇచ్చారు. అక్షరాస్యులైన గిరిజనుల కోసం వారి సంస్థ (ప్రచురించే ‘బొల్‌ కొబొర్‌’ (మంచి మాట) అనే పత్రిక ప్రతుల్ని కూడా అందరికీ ఇచ్చారు.

మేం హట్టగూడనుంచి వస్తున్నప్పుడు ప్రభుత్వపథకాలకీ, స్వచ్చందసంస్థల పథకాలకీ మధ్య తేడాని రమణ చక్కగా వివరించి చెప్పాడు. ప్రభుత్వపథకాల్లో విస్తరణ ముఖ్యం. తక్కువకాలంలో ఎక్కువ మందికి ఫలితాల్ని అందించాలని తాపత్రయపడుతుంది ప్రభుత్వం. వ్యక్తులూ, స్వచ్చందసంస్థలూ చేసే ప్రయత్నాల్లో వినియోగం ముఖ్యం. కొద్ది ఫలితాలైనా దీర్ధకాలంపాటుప్రయోజనకరంగా అందేటట్లు చేస్తారు వీళ్లు.

కాని అభివృద్ధికి రెండూ ముఖ్యమే. ఒకటి- ప్రాసెస్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషనలైజేషన్‌. మరొకటి ప్రాసెస్‌ ఆఫ్‌ఇంటర్నలైజేషన్‌. మొదటిదానికి భారీ యంత్రాంగం కావాలి. పెద్దపెద్ద మొత్తాల్లో పెట్టుబడులు కావాలి. రెండోదానికి వ్యక్తిగత శ్రద్ధ కావాలి, అంకితభావం కలిగిన సేవాతత్సరులు కావాలి. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా అన్ని రకాల ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యే ఇది. క్వాలిటీ భంగపడకుండా క్వాంటిటేటివ్‌ ఎక్స్‌పాన్షన్‌ ఎట్లా అన్బదే.

హట్టగూడ నుంచి అరకు తిరిగి వస్తున్న దారిలోనే మమ్మల్ని మరొక సన్నని మట్టిబాట వెంబడి గిరిజన గ్రామమొకదానికి తీసుకువెళ్లాడు ప్రసాద్‌.

పెద్దపెద్ద చెట్ల తోపుల మధ్య, చింతా, మామిడి, కానుగ చెట్ల మధ్య నిద్రబోతున్నట్టుండే చిన్న గిరిజన గ్రామం కరాయిగూడలో అతడు మాకేమి చూపించబోతున్నాడా అనుకున్నాం. బీదరికం కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న ఆ ఇళ్ల మధ్యనుంచి నడుస్తూ, ఆ పైన పొలాల్లో ఉన్న మందిరమొకదాని దగ్గరకు తీసుకువెళ్లి ‘బొడొభాయి ఉన్నాడా’ అనడిగాడు ప్రసాద్‌ అక్కడున్న గిరిజనుడొకాయన్ని,

కొద్ది సేపట్లోనే ఎర్రని మట్టిరంగు గుడ్డలు ధరించిన సాధువేషధారులు కొందరు గిరిజనులు వచ్చి చేరారు మా దగ్గర. వాళ్ల గురించి ప్రసాద్‌ చేసిన పరిచయం మమ్మల్ని ఎంతో ఆకర్షించింది.

ఆ వచ్చింది గిరిజనులే. కానీ ఒరిస్సాలో డెంకనాల్‌ జిల్లా కేంద్రంగా వ్యాపించిన కౌపీనధారి మహిమ సమాజంలో చేరిన ఆలేఖ్‌లు వాళ్లు. మా దగ్గరకు వచ్చినవారిలో ఆలేఖమహిమ ధర్మ ప్రచారంలో ముఖ్యపాత్ర వహిస్తున్న కొంబుపాణి బొడొభాయి, దామొదర్‌ అధికారి, గోవర్ధన్‌ టొహలియా ఉన్నారు.

ఆలేఖమహిమ 1802 వ సంవత్సరంలో నిర్యాణం చెందిన సిద్ధపురుషుడు యోగేశ్వర మహిమప్రభు ప్రచారం చేసిన జీవనవిధానం. దేవీ దేవతల మూర్తిపూజ నిషేధం, ఏకబ్రహ్మ ఉపాసన, అహింసాపాలన, మద్యమాంసనిషేధం, ఎర్రమట్టిలో ముంచిన కావిరంగు గుడ్డల్ని కట్టడం ద్వారా దేహాలంకార ప్రీతిత్యాగం- ఇవి ఆలేఖ జీవననియమాలు.

“మీ పూజావిధానం ఏమిటి?” అనడిగితే కొంబుపాని బొడొభాయి సగం ఒరియా, సగం హిందీ కలగలిసిన మిశ్రమంలో చాలా నెమ్మదిగా చెప్పాడు.

“పూజావిధానమంటూ ఏమీ లేదు. పొద్దున్న భగవంతుడికి ఏడు సార్లు మొక్కుతాం. ఆ తర్వాత మా పొలం పనులు, ఇంటిపనులు చేసుకుంటాం. తిరిగి చీకటిపడకుండానే భోజనం ముగించి సాయంకాలం మళ్లీ అయిదుసార్లు దేవుడిముందు సాగిలపడతాం, అంతే” అన్నాడు.

ఆ కొండల్లో, ఆ పొలాల్లో నిరాడంబరంగా, పటాటోపం లేకుండా తమ బతుకు తాము బతుకుతున్న ఆ కొటియా, బగత, కొండదొర తెగలకు చెందిన గిరిజనులు నైతికజీవితాన్ని ఎంత సులభసాధ్యం చేసుకున్నారు!

అక్కడ బ్రాహ్మణుల కర్మకాండ లేదు. బౌద్ధుల గృహపరిత్యాగం లేదు. ఇతర అనేకానేక జీవితవిధానాల్లోని ఏ ఆర్భాటమూ, అంధత్వమూ లేదు. పైగా ‘మీ పిల్లలు కూడా తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలా?” అని ప్రకాశ్‌ అడిగితే “అట్లాంటి నిర్బంధమేమీ లేదు. వాళ్లకి ఇష్టమైతే పాటించవచ్చు, లేకపోతే లేదు’ అన్నాడు గోవర్ధన్‌ టొహలియా.

8

పొరజా

వర్షానికి తడిసిన మట్టిరోడ్ల వెంబడి మేం నడుచుకుంటూ అరకు వచ్చేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. అసలే మబ్బు పట్టిఉందేమో మూగవెలుతురొకటి అంతటా వ్యాపించి దిగులు పుట్టిస్తున్నది.

“తర్వాత మన కార్యక్రమం ఏమిటి?” అడిగాడు ప్రసాద్‌.

“ఇక్కణ్ణుంచి పాడేరు వెళ్లాలనుకుంటున్నాం’ అన్నాడు రమణ.

కానీ సరస్వతి ఒప్పుకోలేదు. తను ఒక్క రోజే సెలవు పెట్టి వచ్చాననీ, ఈ రాత్రికే ఎలాగైనా వైజాగ్‌ వెళ్లిపోవాలనీ పట్టుపట్టింది. మాకెవ్వరికీ ఇంకా ఏమీ చూసినట్టే లేదు. ఇంకా ఇట్లానే గ్రామం వెనక గ్రామంలో మజిలీ చేస్తూ తిరిగి చూడాలని ఉంది. కానీ సరస్వతిని ఒక్కర్తినీ ఆ రాత్రి వేళ వైజాగ్‌ పంపలేమనిపించింది. కొద్దిసేపు తర్జనభర్జన తర్వాత ఇప్పటికి అంతా వైజాగ్‌ తిరిగి వెళ్లిపోవాలనీ, మళ్లా కొద్ది రోజుల్లో మరొక పెద్దయాత్రకి సిద్ధపడి రావాలనీ తీర్మానించుకున్నాం.

ఇంక ఆ చీకట్లో బస్సుల కోసం వెయిట్‌ చేస్తో గడిపేకంటే ఏదన్నా టాక్సీ కుదుర్చుకోవడమే మంచిదన్నాడు ప్రసాద్‌. బస్ట్రాండ్‌కి వచ్చి టాక్సీ మాట్లాడుకున్నాం. ఇంక సెలవు తీసుకోబోతూండగా ప్రశాంతి ‘నేనింకా ఎన్నో తెలుసుకోవాలనుకున్నాను. ఇక్కడ గిరిజన తెగలూ, వాళ్ల ఆచారాలూ, అలవాట్లూ తెలుసుకోవాలనుకున్నాను. కొంతదూరం ట్రెక్కింగ్‌ కూడా చెయ్యాలనుకున్నాను. ఏదీ కుదరనేలేదు. మళ్లా ఎప్పుడేనా వస్తే చూపిస్తారా’ అనడిగింది ప్రసాద్‌ని.

ప్రసాద్‌ చిరునవ్వుతో “మీకు నిజంగా గిరిజనుల మధ్యకు పోవాలనుందా? ఇప్పుడే పోదాం” అన్నాడు. అతని ఉత్సాహం చూస్తే ప్రయాణం ఎక్కడ మానుకొమ్మంటాడో అని భయపడింది సరస్వతి. కానీ ప్రసాద్‌ వేరే ఆలోచనలో ఉన్నాడు. అతను మాతో పాటే టాక్సీ ఎక్కి ‘పదండి. మనం వెళ్లేదారిలోనే రోడ్డుమీదనే ఏదన్నా గిరిజన గ్రామాన్ని చూద్దాం” అన్నాడు.

ఆ చీకట్లో వానకి తడిసిన సిల్వర్‌ఓక్‌ చెట్ల పైన వీథిదీపాల కాంతి పడి మెరుస్తూఉండగా, టాక్సీ అరకు వదిలి పెడుతుంటే నాకేదో చెప్పలేని బెంగ కలిగింది. కొంతదూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఎదురైన కూడలిలో టాక్సీ ఆపమన్నాడు ప్రసాద్‌. చీకటి అలముకున్న ఆ గ్రామంలోంచి బాగా తడిసిన మట్టిదారి వెంబడే మమ్మల్ని చిన్నపల్లెకి తీసుకుపోయాడు.

“రండి. ఇది పొరజా తెగవాళ్లుండే చిన్న జనావాసం. పొరజాలు ఇక్కడి గిరిజనుల్లో మరీ ఆదిమజీవితానికి చెందిన తెగ. వాళ్ల జీవితం ఎలాఉంటుందో మీరే చూద్దురుగాని’అన్నాడు.

‘పొరజా అని గోపీనాథమొహంతి నవల ఒకటి ఆక్స్‌ ఫర్డ్‌ ప్రచురణ చూసాను. అది వీళ్ల గురించే” అన్నాడు రమణ.

“గోపీనాథమొహంతి ఒరియా రచయితల్లో జ్ఞానపీఠ బహుమతి పొందిన మొదటి రచయిత. ఆయన చాలాకాలం కోరాపుట్‌ జిల్లాలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ గిరిజనుల్లో కలసిమెలసి జీవించాడు. అక్కడి కోదుల పైన ఆయనరాసిన గొప్ప నవల ‘అమృతసంతానం’ తెలుగుఅనువాదం కూడా వచ్చింది’ అని చెప్పాడు రమణ.

నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎటువంటి మహనీయులు జీవిస్తున్న ప్రపంచం ఇది! నేనే మొదటిసారి చూస్తున్నాను అనుకుంటున్న ఈ జీవితాన్ని నాకన్నా ముందే ఎంతో అద్భుతంగా ప్రపంచానికి ప్రకటించినవాళ్లున్నారంటే, వాళ్ల జీవితానుభవం ఎదట సిగ్గుతో తలవంచింది నా మనస్సు.

ఆ గిరిజన జనావాసంలో కనిపించిన మొదటి ఇంట్లోకే మమ్మల్ని తీసుకుపోయాడు ప్రసాద్‌. గడ్డి కప్పిన పాతమట్టి ఇంట్లో అడుగుపెడుతూ “అతిథులం వచ్చాం. లోపలకి రావచ్చునా” అన్నాడు. ‘రండిబాబూ, రండి” అని వినిపించాయి కంఠాలు ఆ ఇంట్లోంచి. ఆ వచ్చింది ఎవరోనన్న అనుమానం లేదు, ఎందుకొచ్చారన్న ప్రశ్న లేదు. ఉన్నదల్లా అరమరికల్లేని ఆహ్వానం ఒక్కటే

మేం అడుగుపెట్టిన ఆ ఇంటిని ఇల్లనలేం. మొదట కొద్దిసేపు ఆ చీకట్లో మాకు కళ్లు కనిపించలేదు. నెమ్మదిగా కళ్లు విప్పుకుని చూస్తే ఆ ఇంట్లో బిలబిల్లాడుతూ ఎంతో మంది మనుషులు-ఆడా, మగా, పిన్నా పెద్దా కనిపించారు. ఇల్లంతా కలిపి రెండుగదులు. పెద్దదీ, విశాలంగా ఉన్నదీ అయిన ఆ ఒక్క గదిలో ఒక పక్కన నెగడి మండుతోంది.

ఆ నెగడి చుట్టూ కొందరు కూచున్నారు. ఆ గదికి పక్కన ఉన్న మరొక చిన్న గది వంటగది, ధాన్యం గది అన్నీను. నిజానికి దాన్ని గది అని కూడా అనలేం. ఒక్క తడక మాత్రమే అడ్డు. ఆ పక్కనే ఒకామె సత్తుపళ్లాల్లో అందరికీ అన్నం వడ్డిస్తోంది. వాళ్లంతా మేం వెళ్లిన సమయానికి రాత్రి భోజనం ఏర్పాట్లలో ఉన్నారు. మమ్మల్ని చూసి ఆ ఏర్పాట్లు పక్కన పెట్టి మా చుట్టూ మూగారు.

“అయ్యో, మీరు అన్నం తింటున్నారల్లే ఉంది. అన్నం తినండి. పర్వాలేదు. తర్వాత మాట్లాడుకుందాం” అన్నాడు ప్రసాద్‌.

“పర్వాలేదు, పర్వాలేదు” అన్నారు వాళ్లు.

దూరంగా ఆడవాళ్లు వాళ్ల భాషలో ఏదో గొణుగుతున్నారు.

ఏమంటున్నారు?” అనడిగా. వాళ్లు మాట్లాడలేదు.

‘విసుక్కుంటున్నారేమో’ అంది ప్రశాంతి. రెట్టించి అడిగితే మగవాళ్లు చెప్పారు. ‘పెద్దవాళ్లని ఎదురుగా పెట్టుకుని ఎట్లా తింటాం అంటున్నారు వాళ్లు’ అని.

“అలా అయితే మాక్కూడా పెట్టండి మీతో పాటు” అన్నాను. ఉండబట్టలేక దగ్గరగా వెళ్లి చూసాను. అది సామబియ్యం అన్నం. చల్లారిపోయిఉంది. అన్నంతో పాటు వండు గుమ్మడికాయకూర.

మిత్రులంతా నెగడిచుట్టూ సెటిలయ్యారు. రమణ బయటకు పోయి మా లగేజిలోంచి బిస్కట్‌పాకెట్లు పిల్లలకోసం పట్టుకొచ్చాడు. నేను అక్కడున్న ఒకే ఒక బుడ్జిదీపం వెలుతుర్లో ఇల్లంతా కలయచూసాను. ఆ ఇంట్లో ఒకమూల చిన్న ఉట్టి, దేవుడిస్థలం, మరొక పక్క ధాన్యం నిలవచేసుకునే పాతర. చినిగిపోయిందొకటీ, బాగా ఉన్నదొక్కటీ రెండు డప్పులు, విల్లమ్ములు, ఊచలు పైకి పొడుచుకొచ్చిన పాతగొడుగూ, రెండుమూడు కుండలూ, గిన్నెలూ, మరొకపక్క మాసిన గుడ్డలూ, ఆ పక్కన బెంచీపైన రెండు స్టీలుబిందెలూ, ఒక పక్కగా కర్రపెట్టె, రోకలీ, కత్తీ, వ్యవసాయసామగ్రీ, మరొక మూల తుడుం, పిరిడి, సన్నాయి వాద్యాలు.

ఆ ఇంట్లో జనాలందరితో పాటు ఒక మూలన లేగదూడ. దాని పక్కన కుడితిగోలెం. అక్కడంతా చిత్తడి. ఇంటి వెనక మేకలకొట్టం. పశువులశాల. ఇంటికప్పంతా లోపల నల్లగా పొగచూరిపోయిఉంది. వానకు తడిసి తడిసి నానిపోయిన ముక్క వాసన. తడి ఇంట్లో బయటకి పోని పొగా, మనుషుల ఉ చ్ఛ్వాస నిశ్వాసాల్లో వేడెక్కినగాలీ కలగలిసి ఆ ఇల్లంతా ఏదో జీవితపు వాసన వెగటుగా, బరువుగా, మత్తుగా.

ఆ ఇంట్లో వాళ్లందరికీ పెద్దా, అడవిలో మర్రిచెట్టు లాంటివాడూ కిల్లొ డొంబు. ఆయనకి డెబ్భై ఏళ్లుంటాయి. అయినా, యాభై ఏళ్లవాడిలాగా ఉన్నాడు. పొరజాల తెగలో కిల్లో, అంటే పులి గోత్రానికి చెందిన, పూర్వకాలం మనిషి అతడు. అతని భార్య చాలకాలం కిందటే గతించింది. ఇద్దరు కొడుకులు అతనికి. కిల్లోగాసి అతనిపెద్దకొడుకు భార్య. మేం ఆ మధ్యాహ్నం చూసిన కరాయిగూడ గ్రామపు ఆడపడుచు. అతని రెండవకొడుకు సీతారాం, అతని భార్యా అక్కడే ఉన్నారు. పెద్దకొడుక్కి నలుగురు ఆడపిల్లలూ, ఒక మగపిల్లవాడూ. పెద్దది రుక్మిణికి పెళ్లయింది. తక్కిన పిల్లలు లచ్చుమ, బన్ను పద్దమ కూడా అక్కడ నిలబడి మమ్మల్నే చూస్తున్నారు. చింపిరి జుత్తుతో, మిలమిల్లాడే కళ్లతో మమ్మల్ని చూస్తున్న ఆ మగపిల్లవాడి పేరు త్రినాథ్‌. అతగాడు అరకులోయ హాష్టల్లో చదువుకుంటున్నాడు.

సీతారాంకి నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి సోముకు ఇరవయ్యేళ్లుంటాయి. అతని భార్య లక్ష్మి. ఆమెకి నెలల పసికందు. ఆ పిల్లవాణ్ణి గాసి కూతురు లచ్చుమ ఎత్తుకుని ఉంది. ఆ పిల్లవాణ్ణి నా చేతుల్లోకి తీసుకున్నాను.

మట్టిలో మాణిక్యంలా ఉన్నాడు వాడు. భూమిని పెకలించుకుని విరిసిన నల్లకలువలాగా ఉన్నాడు. భూమిస్పర్శ కోల్పోయిన నా చేతుల్లో వాడికి ఊపిరాడలేదుకావును ఒక్కసారి కేర్‌మన్నాడు. ఆతృతగా అందుకుంది వాళ్లమ్మ వాణ్ణి. సీతారాం ముగ్గురుకూతుళ్లు ముక్త, పరమ, జంబూ అక్కడే ఉన్నారు. అమాయికమైన నేత్రాల్లో, ఆసక్తి కలిగించే వదనాల్లో వీళ్లు కాక ఇంకా ఇరుగుపొరుగు ఆడవాళ్లు కొందరున్నారు అక్కడ. మేం వచ్చిన సందడి చూసి కొందరు వచ్చి తలుపుదగ్గర నిల్చున్నారు.

ఆ ఇంట్లో నాలుగు తరాలకు చెందిన పొరజా పురుషులూ, స్త్రీలూ చేరిన ఆ సందడిలో ఆ సమావేశంలో మేమట్లా ఎంతసేపు గడిపేమో మాకే తెలీదు. ప్రసాద్‌, రమణ, ప్రకాష్‌, ప్రశాంతి, సరస్వతీ వాళ్లని ఒక్కొక్కటే ప్రశ్న వెనక ప్రశ్న అడుగుతోంటే వాళ్ల వాళ్ల యథార్థ జీవితదృశ్యాన్ని నెమ్మదిగా మా ముందు ఆవిష్కరిస్తోపోయేరు.

వాళ్ల ఇబ్బందులు, ప్రభుత్వం వేయిస్తున్న రోడ్డుపనిలో వాళ్లు కూలీకి పోవడం, వాళ్లరేషన్‌ సమస్యలు, వ్యవసాయం, పండనిపొలాలు, పారనికాలువలు, కురవనివర్షాలు, దక్కని గింజలు, సంతలో దళారులు, షావుకార్లు, అనంతగిరికొండల్లో కాలూనుకున్న నక్సలైట్లు, పొంచిమీదకు దూకే ఎలుగుబంట్లు, మృగాలకన్నా ప్రమాదకారులైన ఫారెస్టుగారులు, జులుం చేసే తలయారీలు, గోడమీద కాన్సీరామ్‌ పోస్టర్లు, పిల్లవాడి బనియన్‌ మీద చిరంజీవి బొమ్మా, ఇండ్లమీద ఎగురుతున్న తెలుగుదేశం జెండాలు, డొంబుకి బాల్యమిత్రుడైన మాజీ కాంగ్రెస్‌ నాయకుడు… అదంతా పెద్ద ఇతిహాసానికి సరిపడా గాథ.

మేం వచ్చేటప్పుడు ఆకాశమంతా ఆవరించిన ఆకుపచ్చనిదనాన్నే చూసాం. కానీ, ఇప్పుడా ఆకుపచ్చదనం కింద జీవితసంగ్రామపు నీడలు కనిపిస్తున్నాయి. ఆ నీడల్లోంచి జీవితఘర్షణ తాలూకు గాఢమైన రంగులన్నిట్లోకి ప్రయాణించాలని ఉంది. కానీ టూరిస్టుగా కాదు. స్టూడెంటుగా కాదు. మనిషిగా, వాళ్ల మనిషిగా. సాధ్యమేనా అది?

సివిల్‌సర్వీసెస్‌ ధ్యేయంగా పెట్టుకున్న ప్రకాష్‌, ప్రతి దృశ్యాన్నీ తన కెమెరాలో బంధించే రమణ, ప్రతి సమస్యని పత్రికల్లో రిపోర్ట్‌ చేసే ప్రసాద్‌, ప్రతి వేదనకీ ప్రతిస్పందించే ప్రశాంతి, ప్రతి ఆనందానికి పులకరించి గొంతెత్తి గానం చేసే సరస్వతి- వీళ్లంతా బయటి ప్రపంచపు వార్తాహరులు. ఈ జీవితం వీళ్లని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. దీన్నుంచి వీళ్లలో, వీళ్లని వెన్నంటిఉన్న వాళ్లలో కూడా ఏదో నవచైతన్యం మొగ్గ తొడుగుతుంది.

ఈ తడిసి చివికిపోయిన పొగచూరిపోయిన గుడిసెల్లో రోడ్డు కూలీలుగా బతుకుతున్న ఈ పొరజా స్త్రీ పురుషుల జీవితసౌందర్యాన్ని ఒక వస్త్రంలోనో, అలంకారంలోనో, మర్యాదలోనో, మన్ననలోనో మటుకే వెతకడం అవివేకం.

ఆ ఇల్లూ, ఆ బొర్రా గుహ, డి.బి.కె లైను పైన మేం వచ్చిన రైలు కంపార్ట్‌ మెంట్‌, సుంకరమెట్ట సంత, అరకులో ఆశ్రమపాఠశాలా, ఇక్కడి ప్రతి ఒక్క జీవితకేంద్రం వేళ్లు మట్టిలో తన్నుకున్నాయి. దాని శాఖలు ఆకాశంలోకీ వ్యాపించేయి. చీకటిగుయ్యారం లాంటి ఈ గుడిసెలో ఇట్లాంటి ఒక రాత్రి కాళిదాసు గడిపిఉంటే, ఈ ఇంట్లో కూడా ఎప్పుడూ నిత్యజ్యోత్న్న వర్ధిల్లుతోందని అని ఉండడా!

9

ఒక ఉత్తరం రాయకపోడా !

ఆ రాత్రే వచ్చేసాం విశాఖపట్నానికి. కానీ, జీవించినంతకాలం ఆ అడవిలో వీచిన గాలులు, రాలిన పువ్వుల్లాంటి ఎన్నటికీ వాడిపోని మృదులతర జ్ఞాపకాలో, కానీ ఎప్పుడన్నా ఆ పాఠశాలలోని ఏ బాలుడన్నా నా అడ్రస్‌కి తన ఉజ్జ్వల జీవితాన్ని వర్ణిస్తో ఉత్తరం రాయకపోడా అనిపిస్తుంది.

ఆ పురాతన మహానంద సౌరభమకుటం ధరించిన ఆ బీద పొరజా కుటుంబం మేం వచ్చేటప్పుడు “బాబూ, కలట్రుగారికి చెప్పి ఇక్కడ మా గూడలో ఓ మంచినీళ్ల బోరు వేయించండి, మా పిల్లలకోసం ఓ బడి పెట్టించండి’ అని కోరిన కోర్కెలు, మేం చూడలేని అనేకవందల గిరిజన జనావాసాల్లోని అట్లాంటివే ఎన్నో కోర్కెలు ఎన్నటికన్నా పూర్తిగా తీరుతాయా అనిపిస్తుంది.

కానీ బైలదిల్లా గనుల వల్ల బస్తర్‌ అడవుల్లో అదృశ్యమైనట్లే ఈ ఆధునిక జీవితాభివృద్ధి వల్ల ఆ పాటలూ, ఆ నవ్వులూ , ఆ పుష్యమాసపు వేడుకలూ అంతరించి పోకుండా నిలుస్తాయా అనికూడా అనిపిస్తుంది.

కాని, అర్థం లేని ఆరాటాల్లో పరుగుతీస్తున్న ఈ విశాఖ మహాజనసముద్రం మధ్యలో కూడా ఆర్‌.టి.సి కాంప్లెక్స్‌ సెంటర్‌లో నిశ్చల ప్రతిష్టితుడైన మహాకవి గురజాడ, ఎన్నటికీ ఆరని లైట్‌హౌస్‌ లాగా, ఎటువంటి నిద్రనైనా మేల్కొల్చుతూఉండకపోడా అని ఏదో ఒక ఆశ.

ఇండియాటుడే వార్షిక సంచిక, 1995


Walking through Araku

7

Good News

We saw quite a lot in and around Araku Valley that day: the open-air theatre, the Gangamma temple, the Padmapuram Gardens, and the public school. Yet, the truly unforgettable highlights of our journey that day were Hattaguda and Karaiguda.

After visiting Padmapuram Gardens, Prasad suggested, “Let’s go to Hattaguda.” Hiring two auto-rickshaws in town, we set off from Araku along the mountain trails. Flanked on both sides by fields ripe with niger (oliselu) and little millet (chamalu), a journey of five to six kilometers winding through silver oak plantations brought us before the gates of a lovely compound.

“This is a voluntary organization called the Adivasi Abhivrudhi Samskrutika Sangham (Tribal Development and Cultural Association). A Canadian national named Uwe Gustafsson has been working here for the last twenty years, organizing the tribal people and dedicating immense effort to linguistic research, adult education, horticulture, and vocational skills. I brought you here specifically to show you this,” Prasad explained.

The sheer dedication of this foreigner in organizing ordinary tribal folk within that small Kotiya village left us deeply amazed. Prasad arranged an opportunity for us to meet and talk with him. With great gentleness and courtesy, he chatted with us about many things. Inside the organization’s premises, we saw a floral nursery, a printing press, a carpentry unit, rabbit farming, and storage centers. We also saw dictionaries they had printed in the Adivasi Odia language, adult education readers, monographs on forest produce and coffee cultivation, and curated collections of tribal folk stories and songs.

He presented each of us with a complimentary copy of Adibasi Lokor Porab Kotho, a distinctive work documenting tribal festivals. He also gave everyone copies of Bol Kobor (“Good News”), a magazine published by their organization for literate tribal people.

As we were returning from Hattaguda, Ramana beautifully explained the difference between government programs and voluntary initiatives:

In government programs, scale and expansion are the focus. The government is eager to deliver outcomes to the maximum number of people in the shortest possible time. In the efforts of individuals and voluntary groups, usability and depth are the focus. Even if their reach is modest, they ensure that the benefits remain meaningful over the long term.

Yet both are vital for development. One is the process of institutionalization, while the other is the process of internalization. The first requires massive machinery and large-scale investments. The second demands personal care and dedicated social workers committed to selfless service. This is a fundamental challenge faced not only in our country, but by governments worldwide: how to achieve quantitative expansion without compromising qualitative excellence.

On our way back to Araku from Hattaguda, Prasad led us along another narrow dirt trail into a tribal village.

We wondered what he was about to show us in Karaiguda, a sleepy little hamlet resting quietly amidst dense groves of tamarind, mango, and honge (kanuga) trees. Walking past homes where poverty was glaringly visible, he led us toward a prayer house situated out in the fields and asked a local tribal man, “Is Bodo Bhai around?”

Within moments, a few tribal men dressed in the ascetic attire of reddish-clay-dyed cloth came and joined us. Prasad’s introduction of them fascinated us immensely.

Though tribal by origin, they were Alekhs who had embraced the Kaupinadhari Mahima Samaj, a spiritual movement centered in the Dhenkanal district of Odisha. Among those who met us were Kombupani Bodo Bhai, Damodar Adhikari, and Govardhan Tohalia, who played key roles in spreading the faith of Alekh Mahima Dharma.

Alekh Mahima is a way of life propagated by the enlightened saint Yogeshwara Mahima Prabhu, who passed away in 1802. Its central tenets include the prohibition of idol worship, the contemplation of a single formless Divine (Eka Brahma), strict adherence to non-violence, total abstinence from meat and liquor, and the renunciation of bodily vanity by wearing simple robes dyed in red soil.

When we asked, “What is your method of worship?”, Kombupani Bodo Bhai answered very softly in a blend of Odia and Hindi:

“We have no elaborate rituals. In the morning, we bow to God seven times. Afterward, we go about our field work and household chores. We finish our dinner before dark, and in the evening, we prostrate before God five times. That is all.”

Living simple, unpretentious lives in those hills and fields, how effortlessly these tribal folk belonging to the Kotiya, Bagata, and Konda Dora communities had embraced a refined moral life!

There were no elaborate rituals of the priesthood, no complete renunciation of worldly life as in monastic orders, and none of the pomp, show, or blind superstition found in countless other systems of life.

Furthermore, when Prakash asked, “Must your children strictly follow these rules too?”, Govardhan Tohalia replied, “There is no compulsion at all. If they wish to, they may follow them; otherwise, they don’t have to.”

8

Poraja

By the time we walked back along the rain-drenched mud roads into Araku, deep darkness had set in. Perhaps because the sky was overcast, a sullen, muted twilight spread everywhere, stirring a sense of melancholy.

“What is our plan next?” asked Prasad.

“We were thinking of heading to Paderu from here,” Ramana replied.

Saraswati, however, did not agree. She insisted that she had taken only one day off and had to return to Vizag that very night no matter what. None of the rest of us felt ready to leave; we felt as though we hadn’t seen anything yet, wishing instead to keep traveling, moving from hamlet to hamlet. But we could not leave Saraswati to travel back to Vizag alone at night. After a brief debate, we decided that all of us would return to Vizag for now and prepare for a much longer journey in a few days.

Prasad suggested that rather than waiting endlessly for buses in the dark, it would be wiser to hire a taxi. We went to the bus stand and negotiated a cab. Just as we were about to take our leave, Prasanthi said to Prasad, “There was so much more I wanted to understand—the tribal communities here, their customs, their everyday ways. I even wanted to go trekking for a while. None of it worked out. If we come back sometime, will you show us around?”

Prasad smiled and replied, “Do you truly want to go among the tribal people? Let’s go right now.”

Seeing his enthusiasm, Saraswati grew nervous that he might cancel our return journey altogether. But Prasad had another idea in mind.

Getting into the taxi with us, he said, “Come on. On our way back, we can visit a tribal village right along the main road.”

As streetlights glinted off the rain-soaked silver oak trees in the dark, an unspoken ache washed over me as the taxi left Araku behind. After driving for a short distance, Prasad asked the driver to stop at a junction. From that dark village, he led us down a thoroughly soaked dirt trail into a small hamlet.

“Come along. This is a small settlement of the Poraja tribe. Among the local tribes, the Porajas lead one of the most primitive ways of life. See for yourselves how they live,” he said.

“I remember seeing an Oxford publication of Gopinath Mohanty’s novel titled Paraja. It is about these very people,” remarked Ramana.

“Gopinath Mohanty was the first Odia writer to receive the Jnanpith Award. He worked as a government officer in Koraput district for a long time and lived closely among the tribal people. His monumental novel on the Kandhas here, Amrutara Santana, has also been translated into Telugu,” Ramana explained.

I felt a wave of wonder. What remarkable human beings have lived in this world! Here was a life I thought I was witnessing for the very first time, yet others had already portrayed it brilliantly to the world long before me. Before their profound depth of experience, my mind bowed in humble reverence.

Prasad led us straight into the first house in the settlement. Stepping into that old thatched mud hut, he called out, “We have arrived as guests. May we come inside?”

“Come in, babu, come in,” voices answered from within. There was no suspicion about who had arrived, nor any question as to why we had come. There was only a pure, open-hearted welcome.

What we stepped into could hardly be called a house. At first, our eyes could see nothing in the dark. As our vision adjusted, we saw a crowd of people—men, women, young, and old—bustling inside. The entire dwelling consisted of just two rooms. In the larger room, a fire was burning in one corner.

A few people sat gathered around the fire. A smaller space next to it served as both a kitchen and a grain store. In truth, one could barely call it a separate room; only a woven bamboo screen partitioned it off. Beside it, a woman was serving rice into tin plates. When we walked in, they were preparing to have their dinner. Seeing us, they set their plates aside and gathered around us.

“Oh, it looks like you were about to eat! Please, go ahead and eat. It’s quite alright. We can talk later,” Prasad said.

“It’s alright, it’s quite alright,” they replied.

In the shadows, the women were murmuring something among themselves in their dialect.

“What are they saying?” I asked. They stayed silent.

“Perhaps they are annoyed,” Prasanthi guessed.

When we pressed them again, the men answered: “They are saying, ‘How can we eat right in front of respected elders?'”

“In that case, serve us a plate too along with yours,” I offered. Unable to hold back my curiosity, I stepped closer to look. It was cooked little millet (sama rice), already grown cold, accompanied by a curry of yellow pumpkin.

Our friends settled down around the fire. Ramana stepped out to our taxi and brought back biscuit packets from our luggage for the children.

By the dim light of the single small kerosene lamp, I took in the entire house. In one corner hung a small hanging rope shelf (utti) and a sacred altar for worship; in another corner lay a sunken pit (pathara) for storing grain. There were two tribal drums—one torn and one intact—along with bows and arrows, an old umbrella with its metal spokes poking through, two or three earthen pots and bowls, soiled clothes tossed to one side, two steel water pots on a bench, a wooden chest, a pestle, a sickle, and farming tools. In another corner rested folk musical instruments: the tudumu, piridi, and sannai.

Sharing the space with all the family members was a young calf in one corner, standing next to a trough of cattle feed in the damp muck. Behind the house were a goat pen and a cattle shed. Inside, the entire ceiling was blackened with thick soot, filled with the damp smell of thatch soaked through by rain. Trapped smoke, damp walls, and the warmth of human breath mingled together to give the house a heavy, raw, intoxicating scent of survival.

The elder of the household—standing tall like a banyan tree in the forest—was Killo Dombu.

He was around seventy years old, yet carried himself like a man of fifty. He belonged to the Killo clan (the Tiger clan) of the Porajas—a man of the old world. His wife had passed away long ago. He had two sons. Killo Gasi was his elder son’s wife, a woman hailing from the village of Karaiguda that we had visited that afternoon. His second son, Sitaram, and his wife were also present.

The elder son had four daughters and a son. The eldest daughter, Rukmini, was already married. The other children—Lachuma, Bannu, and Paddama—stood watching us curiously. The young boy gazing at us with tousled hair and sparkling eyes was Trinadh; he was studying at the government hostel in Araku Valley.

Sitaram had four children. His eldest son, Somu, was around twenty, and his wife was Lakshmi, holding a newborn infant just a few months old. Gasi’s daughter, Lachuma, had picked up the baby. I took the infant into my arms.

He looked like a ruby resting in the mud, like a dark water lily blossoming out of the earth. Unused to the touch of hands disconnected from the soil, the child must have felt uneasy, for he let out a sharp cry. His mother hurriedly took him back. Sitaram’s three daughters—Mukta, Parama, and Jambu—were also there. Along with these innocent eyes and curious faces, several neighboring women had gathered, while others stood at the doorway watching the commotion.

Amidst that lively gathering of Poraja men and women spanning four generations, we lost all track of time. As Prasad, Ramana, Prakash, Prasanthi, and Saraswati asked question after question, they slowly unveiled the unvarnished reality of their everyday lives before us.

Their struggles; laboring for daily wages on government road works; their ration troubles; farming fallow fields; dry canals; failed rains; meager harvests; middlemen and money lenders at the weekly markets; Naxalites establishing footholds in the Ananthagiri hills; bears lurking to attack from behind trees; forest guards far more dangerous than wild beasts; tyrannical village watchmen; Kanshi Ram posters on the walls; Chiranjeevi prints on a young boy’s vest; Telugu Desam flags fluttering atop huts; a former Congress leader who was Dombu’s childhood friend… It was a saga rich enough for an epic.

When we arrived, we had seen only the lush green canopy draped across the sky. But now, beneath that greenery, the deep shadows of life’s harsh struggles were laid bare. Looking at those shadows, one felt a longing to journey into the raw, intense colors of their human conflict—not as a tourist, nor as a detached student, but as a human being, as one of their own. Is that ever truly possible?

Prakash aiming for the Civil Services, Ramana capturing every scene through his lens, Prasad reporting every crisis for the press, Prasanthi empathizing with every sorrow, Saraswati singing with joy at every beauty—they were all messengers to the outside world. This life would undoubtedly leave an indelible mark on them, planting seeds of new awareness within them and those around them.

To seek the beauty of these Poraja men and women—living as road laborers in these damp, crumbling, soot-blackened huts—merely in fine clothing, ornaments, etiquette, or social graces would be utter folly.

That home, the Borra Caves, the train compartment on the DBK line, the weekly market at Sunkarametta, the ashram school in Araku… Every single center of life here had its roots deep in the soil, while its branches reached out to the sky. If Kalidasa had spent a night like this in a dark, humble hut such as this, would he not have declared that here, too, perpetual moonlight shines forever?

9

A Letter May Come!

We returned to Visakhapatnam that very night. Yet, for as long as I live, the winds that swept through that forest will remain like gentle, unwithering blossoms in my memory. I often wonder whether, someday, one of those young boys from the school might write a letter to my address describing his bright and thriving future.

As we were taking our leave, that impoverished Poraja family—crowned with the timeless fragrance of pure joy—pleaded with us: “Babu, please speak to the Collector and arrange a borewell for drinking water in our village, and set up a school for our children.” I wonder if such modest hopes, echoed across hundreds of other tribal settlements we never got to see, will ever be fulfilled.

At the same time, just as traditions vanished in the forests of Bastar due to the Bailadilla mines, I wonder whether their folk songs, their laughter, and their joyful winter celebrations in the month of Pushya will survive without being erased by modern developmental progress.

And yet, amidst this vast ocean of humanity rushing through mindless anxieties in Visakhapatnam, hope remains: that the statue of the great poet Gurajada, standing serene and steadfast at the RTC Complex junction like an eternal lighthouse, will never cease to awaken us from our slumber.

(Published in the India Today Annual Issue, 1995)

3 Replies to “నేను తిరిగిన దారులు-4”

  1. ఇక్కడి ప్రతి ఒక్క జీవితకేంద్రం వేళ్లు మట్టిలో తన్నుకున్నాయి. దాని శాఖలు ఆకాశంలోకీ వ్యాపించేయి. చీకటిగుయ్యారం లాంటి ఈ గుడిసెలో ఇట్లాంటి ఒక రాత్రి కాళిదాసు గడిపిఉంటే, ఈ ఇంట్లో కూడా ఎప్పుడూ నిత్యజ్యోత్న్న వర్ధిల్లుతోందని అని ఉండడా!

    పొరజా పల్లెలో కాళిదాసు … వాహ్!

  2. Decades ago మీరు చేసిన ఈ యాత్ర చదువుతుంటే ఇప్పటికీ ఎంత fresh‌ గా అనిపిస్తుంది!!

    ప్రదేశాలను చూడటమే కాదు, అక్కడి మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని, సంస్కృతిని అర్థం చేసుకుంటూ ప్రయాణించినప్పుడు, మీరన్నట్లుగా, “This life would undoubtedly leave an indelible mark on them, planting seeds of new awareness within them and those around them.”

    Travel చేస్తే ఇలాగ కదా చెయ్యవలసింది. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading