మరొకసారి అడవిదారుల్లో

ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.

అరకులోయలో చెక్కుచెదరని శిఖరం

ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అరకులోయలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాక, నేను ఒకప్పుడు తిరిగిన దారుల్ని మళ్ళా వెతుక్కుంటూ హట్టగూడ, కరాయిగూడ గ్రామాలకు వెళ్ళాను. ఇరవయ్యేళ్ళ కిందట, ఇండియా టుడే పత్రికకోసం అరకులోయ మీద యాత్రాకథనం రాస్తూ ఆ గ్రామాలగురించి రాసాను.