కొన్ని కలలు కొన్ని మెలకువలు-15

9

మా సంతోష చంద్రశాల

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పదవ తరగతిలో సాధించిన ఫలితాల్ని సంబరంగా జరపాలన్నారు మా ప్రాజెక్టు అధికారి. అది కూడా పార్వతీపురంలో కాదు, విజయనగరంలోనే అన్నారు. మారుమూల అడవుల్లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ కూడా ఆ పాఠశాలలు సాధించిన ప్రగతిని నలుగురికీ చెప్పి సంతోషపడటానికీ అదే సరయిన వేదిక అన్నారాయన.

పాఠశాలలు సాధించిన ప్రగతిలో కేవలం గిరిజన సంక్షేమ పాఠశాలల్నే ఆయన పెద్దవి చేయాలనుకోలేదు. యాజమాన్యాలేవి అయినప్పటికీ, గిరిజన ప్రాంతాల స్ధితిగతులు అన్నిచోట్లా ఒక్కటే కాబట్టి విశిష్ట కృషి చేసిన ఇతర యాజమాన్య పాఠశాలల్ని కూడా సత్కరించాలని ఆయన ఆరాటపడ్డారు.

ఒకప్పుడు విజయనగరం జిల్లా మక్కువ ప్రాంతంలో ఆకుండి నారాయణ మూర్తి అనే ఉపాధ్యాయుడు జిల్లాపరిషత్ పాఠశాలల్లో పనిచేసారు. ఆయన్ని నేనొక్క మారే చూసాను. ఆయన మంచి కథారచయితే కాకుండా తన జీవితకాలమంతా గిరిజనుల సాహిత్యాన్ని, ముఖ్యంగా జాతాపుల సాహిత్యాన్ని సేకరించడానికి చాలా కృషి చేసారు.                  

అందుకని బయటి పాఠశాలల్లో పనిచేస్తూ గిరిజన విద్య కోసం విశేష కృషి చేసిన ఉపాధ్యాయునికి ‘ఆకుండి నారాయణమూర్తిస్మారక బంగారుపతకం’ ఇవ్వాలనుకున్నాం. మొదటిసారిగా ఆ సత్కారానికి మొండెంఖల్లు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి ఎంపికచేసారు.

నిజానికి గిరిజన సంక్షేమ విద్యాలయాల సిబ్బంది చేసిందాన్ని ‘కృషి’ అనే చిన్నమాటతో సరిగ్గా వివరించలేం. దాన్ని త్యాగం అనాలి.

ధర్మలక్క్ష్మీపురంలోగిరిజనుల కోసం ప్రభుత్వం ఇళ్లకాలనీ నిర్మించింది. ఆ కాలనీ నిర్మాణం నాసిరకంగా ఉందని గిరిజనులు ఆ ఇళ్లలోకి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. ఎవరూ కాపురముండటానికి ఇష్టపడని ఆ ఇళ్లు నెమ్మదిగా నెమ్మదిగా కూలిపోతుండేవి. అటువంటి ఇళ్లల్లో నివాసముండి ఆ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సవరల విద్యారంగంలో చరిత్ర సృష్టించారు. వారి త్యాగాల్ని ఏ విధంగా సన్మానించగలుగుతాం?

అయినా, మా ప్రాజెక్టు అధికారి శక్తివంచన లేకుండా ఆకాశమంత పందిరి వేసి మరీ ఆ విజయాన్ని ఉత్సవంగా మార్చేసారు. కాని ఆ దృశ్యాన్ని చూసే అవకాశం నాకు లేకపోయింది.

అప్పటికి రెండువారాల కిందట, పాచిపెంట మండలంలోని మారుమూల కొండగ్రామాలైన మిలియాకంచూరు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు నన్ను మలేరియా పట్టుకుంది. అది మామూలు మలేరియా కాదు. ఒకప్పుడు యూరోపియన్ సివిల్ సర్వెంట్లు ఆసియాదేశాల్లో ఏ జ్వరం పేరు చెపితే ఒణికిపోయేవారో ఆ ‘బ్లాక్ వాటర్ ఫీవర్ ’ అది. అది నన్ను రెండునెలలు మంచం మీద పడెయ్యడమే కాక పూర్తిగా పీల్చి పిప్పి చేసింది. నా లివర్ పూర్తిగా దెబ్బతింది. ఆ అస్వస్ధతనుంచి నా లివర్ ఇప్పటికీ కోలుకోనేలేదని చెప్పాలి. నేను నా మంచంమీంచే ఆ ఉపాధ్యాయులకూ, విద్యార్ధులకూ నా శుభాకాంక్షలు పంపించాను. 

89-90 విద్యాసంవత్సరం మొదలుకాగానే మా దృష్టిని మరికొన్ని పాఠశాలల మీద సారించాలనుకున్నాం. గుమ్మలక్క్ష్మీపురం మండలంలోని టిక్కబాయి, జియ్యమ్మ వలస మండలంలోని రావాడ రామభద్రపురం, పార్వతీపురం మండలంలోని డోకిశీల, కొమరాడ మండలంలోని ఉలిపిరి, మక్కువ మండలంలోని యెర్రసామంతవలస, సాలూరు మండలంలోని తోణాం మా పిలుపు కోసం తలెత్తి సంసిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటికన్నా ముఖ్యంగా మేం రేగిడి పాఠశాల మీద చాలా ఆశలు పెట్టుకున్నాం.

రేగిడి గుమ్మలక్క్ష్మీపురం మండలంలోని లోతట్టు ప్రాంతంలోని గ్రామం. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ కార్యక్రమాలు మొదలుపెట్టిన మొదటిరోజుల్లో ఎవరో ప్రాజెక్టు అధికారి గిరిజన బాలికల కోసం ఎంతో సదుద్దేశంతో అక్కడొక ఆశ్రమ పాఠశాలని ప్రారంభించాడు.

నాగరిక ప్రపంచపు వాసనలు సోకని ఆ అడవి ఒడిలో గిరిజన బాలికలకొక శాంతినికేతనం సమకూరుతుందని ఆయన భావించి ఉండవచ్చు. కాని ఆచరణలో జరిగింది అందుకు విరుద్ధం. ఏడాదికి ఆరునెలలు రహదారి సరిగ్గా ఉండని ఆ గ్రామాన్ని గాని, ఆ పాఠశాలని గాని సందర్శించే వారే లేకపోయారు. ఏ విధమైన  సౌకర్యాల్లేని      ఆ ప్రాంతానికి పోవడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండేవారు కారు.

చాలా రోజులు ఆ పాఠశాలని ఎలా సంస్కరించాలా అన్నదాని గురించే మేమంతా చర్చిస్తూ వచ్చాం. దానికి ఏం చెయ్యాలా అన్న ఆలోచన ఒక కొలిక్కి తెగలేదు. ఒక దశలో ఆ పాఠశాలని అక్కణ్ణుంచి గుమ్మలక్క్ష్మిపురం తరలిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన వచ్చింది.

కాని మాప్రాజెక్టు అధికారికి ఆ పాఠశాలని అక్కడనే ఉంచుతూ, దాన్నొక సవాలుగా తీసుకోవాలనిపించింది. ఇక, ఒకటొకటే చర్యలు చేపట్టడం మొదలయ్యింది. సంస్ధలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిలో సీనియర్, నిష్కళంకుడు, సమర్ధుడూ అయిన సీతారామ్మూర్తిని ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయమని అభ్యర్ధించాం. ఆయన మా అభ్యర్ధనను అంగీకరించి ఆ పాఠశాల బాధ్యతలు స్వీకరించాడు.

రెండవసమస్య, ఆ పాఠశాల ఆవరణలోనే ఒక మండల ప్రాథóŠమిక పాఠశాల  ఉండేది. ప్రాథమిక స్ధాయిలో పూర్తి స్ధాయి బాలికల పాఠశాలని ఏర్పాటుచేయడానికి నిబంధనలు అంగీకరించవు. కాని, ఆ అవరణలో ఒక్క మగపిల్లవాడు కూడా ఉండ కూడదన్నది మా ఉద్దేశ్యం. చివరికి జిల్లాకలెక్టరు చొరవతో ఆ సమస్య కూడా పరిష్కారమైంది. ఆ మీదట తన ఏళ్ల తరబడి నిద్రని విదిలించుకుని ఆ పాఠశాల ఒక్కొక్క అడుగే చకచకా ముందుకు వేయడం మొదలయ్యింది.

అక్కడ చదువుతున్న బాలికలే కాకుండా సమీపప్రాంతాల్లోని బాలికల్ని కూడా అక్కడ చేర్పించాం. తనొక గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు, తమ బాలికల్ని రేగిడి పాఠశాలకు పంపించవలసిందిగా మా ప్రాజెక్టు అధికారి విజ్ఞప్తి చేసినప్పుడు ఒక గిరిజన ఉద్యోగి రేగిడి నాగరితకకు దూరంగా ఉన్న గ్రామం అన్నాడట.

అప్పుడు నాగరికత అంటే ఏమిటని వారిరువురి మధ్యా  కొంతసేపు చర్చ జరిగిందట. ఆసక్తికరంగా ఆ చర్చ చివరకి బాలకల వస్త్రధారణ దగ్గరికి వచ్చి ఆగిందట. ఆ గిరిజన ఉద్యోగి ‘బాలికలు టౌనులో చదువుకుంటే పంజాబీ డ్రెస్సు వేసుకోవడానికి ఇష్టపడతారు. ఆ మారుమూల గ్రామంలో వాళ్లెప్పటికీ మీరిచ్చే పాతకాలపు యూనిఫారంనే వేసుకోవాల్సి  ఉంటుంది కదా’ అని ప్రశ్నించాడట.

అతని మాటలకు మా ప్రాజెక్టు అధికారి చాలా సున్నితంగా స్పందించారు. నిజానికి అప్పట్లో మేం కాటన్ ప్రింటెడ్ ఫ్రాకు లేదా స్కర్టు – బ్లౌజు మాత్రమే పిల్లలకు ఇచ్చేవాళ్లం. పంజాబీ డ్రెస్సులు ఇవ్వడానికి ప్రభుత్వ ఉత్తర్వులు లేవు.

పాఠశాల నుంచి ఇద్దరు పిల్లల్నీ, మేట్రన్‌నీ, వారితో పాటు స్వయంగా తన శ్రీమతినీ ఆయన విజయనగరం పంపించి పిల్లలు కోరుకున్న మేరకి వారు ఎంచుకున్న వెరయిటీ ప్రకారం ప్రతి బాలికకీ రెండేసి డ్రెస్సులు కుట్టించారు. ఇది ఈ రోజు చిన్నవిషయంగా కనిపించవచ్చు గానీ, ఆ రోజు ఆ పాఠశాలకొక మద్ధతునివ్వడంలో ఇది బాలికల మీద చూపిన ప్రభావం అపారం.

కొన్ని పాఠశాలల మీద మేం వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పటికీ, చాలా పాఠశాలలు మా పిలుపు కోసం ఎదురుచూడకుండా తమంత తామే వికసించడానికి ప్రారంభించాయి.

వాటిల్లో గురుకుల పాఠశాల, పి.కోనవలస గురించి చెప్పాలి. దాని ప్రిన్సిపాల్‌గా ఉంటున్న సాంబమూర్తి గురుకులపాఠశాలల పాతతరానికి చెందిన   ఉపాధ్యాయుడు. ఆయనకి కొన్నాళ్లు సి.ఎస్.రావుగారితో కలిసి పనిచేసిన అనుభవం  ఉంది. ఒక సంస్ధ అధిపతి కార్యశీలిగా ఉంటే ఎలా ఉంటాడో ఆయన్ని చూసి నేను తెలుసుకున్నాను. అవసరమయితే, ఏదన్నా సామగ్రి పాఠశాలకు లభిస్తుందంటే అతడే గోడౌన్ దగ్గరికి పోయి ఆ సామగ్రిని తనే స్వయంగా మూటగట్టుకునేవాడు. అవసరమైతే తనే నెత్తిన పెట్టుకుని మోసుకుని పోయేవాడు. పి.కోనవలస సాలూరు నుంచి జయపురం వెళ్లే రహదారి మీద ఉండేది. ఆయన కృషి వల్ల ఆ రెండు మండలాలకే కాక చాలామంది గిరిజనులకదొక డెమాన్‌స్ట్రేషన్ పాఠశాలగా ఉండేది.

మారుతున్న ఋతువుల మధ్య, పచ్చని ప్రకృతి ఒడిలో పాఠశాలలు కూడా పిల్లల్లా పెరుగుతుండేవి. పిల్లలు ఎదుగుతుంటూ మనకా పెరుగుదల అనుక్షణం ఎలా తెలుస్తూ ఉంటుందో పాఠశాలలు పెరగడం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మానవీయ చైతన్యానికి అవొక ప్రతిస్పందననిస్తూంటాయి.

ఈ సందర్భంగా ఒక హార్టికల్చర్ అధికారి అన్నమాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. గుమ్మలక్క్ష్మిపురం మండలంలోని సవరకోటపాడు గ్రామంలో మా సంస్ధ కొక పండ్లమొక్కల నర్సరీ ఉండేది. దాని అధికారి ఒకసారి నాతో అన్నాడు కదా. ‘మొక్కలు మనతో మాట్లాడుతాయి సార్. ముఖ్యంగా ఎదుగుతున్న మొక్కలు. నర్సరీలో ఇన్నివేల మొక్కలుంటాయి కదా. మనం రౌండ్లుకి వెళ్లేటప్పుడు, సరిగ్గా ఏ మొక్కకి సమస్య              ఉంటుందో అక్కడే మనకి తెలియకుండా మనం ఆగిపోతాం’ అని.

పాఠశాలల పెంపకం, సంరక్షణ కూడా అలాంటిదే. అవి మనతో మాట్లాడుతాయి. మన కోసం ఎదురుచూస్తాయి.తలలూపుతాయి. కిలకిలనవ్వుతాయి. నెమ్మదిగా, మా          ఉపాధ్యాయుల్లోని కవులు, గాయకులు బయటికి రావడం మొదలుపెట్టారు.

ఇప్పుడు కళింగాంధ్ర కథకుల్లో అగ్రశ్రేణిలో ఉన్న గంటేడ గౌరునాయుడు అప్పుడు రాసిన పాటల్తో టిక్కబాయి ఆశ్రమపాఠశాల మార్మ్రోగిపోయేది. పిల్లలు శ్రావ్యంగా ఆ పాటలు పాడుతుంటే, గాలుల్లో ఇప్పపూల పరిమళాలు తేలుతుండేవి. ఇంకా, గణపతి, ‘ఆప్తచైతన్య’ గా పేరుపొందిన డి.వెంకటరావు, ఎందరో, ఎందరో.

కొత్తగా సంస్ధలో ప్రవేశిస్తున్న ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతి గురించి తెలియడానికి కొంత మెటీరియల్ రూపొందించే ఉద్దేశ్యంతో మొదలయిన విద్యాశాల అనతికాలంలోనే గిరిజన విద్యాప్రణాళికా కేంద్రంగా వికసించింది. నేడు గిరిజన ప్రాంతాలన్నిటిలో గిరిజన విద్యావ్యవహారాలకు సంబంధించిన ప్లానింగ్, మానిటరింగ్ అంశాల్ని చూసే ప్రాజెక్టు మానిటరింగ్, రిసోర్స్ సెంటర్లకు (పి.ఎం.ఆర్.సి) అదే మాతృక.

అప్పట్లో డోకిశీల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బగత సత్యనారాయణ   ఆ విద్యాశాఖను చూస్తూ ఉండేవాడు. వివిధ సాహిత్యాల్లోని ఉత్తమ రచనల్ని ఎంపిక చేసి వాటిని సవర, కుయి భాషల్లోకి అనువాదం చేయించే కార్యక్రమం కూడా విద్యాశాఖ చేపట్టింది. దానికొక చిన్నలైబ్రరీ కూడా ఏర్పాటయ్యింది.

నెమ్మదిగా, మా పాఠశాలలేకాక బయటి పాఠశాలలూ, బయటి ఉపాధ్యాయులూ కూడా మా ప్రతిస్పందనని కోరుకోవడం మొదలయ్యింది. వారిలో ఇద్దరు, ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

నేరెళ్ల నారాయణమూర్తి గిరిజనవిద్యార్ధుల్లో సంస్కృత భాషాబోధన కోసం తనంతతానే విశేషకృషి చేసారు. ఆయన కృషికి గుర్తింపుగా పార్వతీపురంలోని జిల్లా పరిషత్ సంస్కృత పాఠశాలను జిల్లాపరిషత్ ఆయనకు అప్పగించింది. పిల్లల్లేక మూతపడటానికి సిద్ధంగా ఉన్న ఆ పాఠశాలకు చేయూత ఇవ్వవలసిందిగా ఆయన సంస్ధని అభ్యర్ధించారు. అందరి సమష్టి కృషి ఫలితంగా నేడది విజయనగరం జిల్లాలోనే సుప్రతిష్ట పాఠశాలగా పనిచేస్తూ ఉంది.

పేర్కొనవలసిన మరొక వ్యక్తి పి.పారినాయుడు. తదనంతరకాలంలో సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమంల్లో ఎంతో చురుకైన పాత్ర నిర్వహించిన పారినాయుడు అప్పట్లో గొరడలో పనిచేస్తుండేవారు. మేం రేగిడి పాఠశాల కోసం చేపట్టిన ప్రతి ఒక్క చర్యకూ ఆయన ప్రధాన మద్ధతుదారు. అంతేకాక, వావిలాల గోపాలకృష్ణయ్య గారికి ప్రియశిష్యుడు. ఆ స్ఫూర్తితో ఆ రోజుల్లోనే గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ మద్యనిషేధం కోసం ఉద్యమాన్ని చేపట్టాడు. 

పార్వతీపురంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రాజనీతి బోధించే నాగార్జున కూడా మా సంస్ధకి విద్యావిషయకంగా స్నేహితుడిగా, మార్గదర్శిగా, సహచరుడిగా నిలబడే ఉండేవాడు.

ఇలా కొన్ని రోజులకే, సంస్ధ గిరిజన ప్రాంతాల్లో వాతావరణాన్ని మార్చేసింది. నేనేమనుకుంటానంటే, పాఠశాలలు పనిచేస్తున్నాయి అని గాని, పనిచేయడం లేదని గాని అంటున్నప్పుడు మనం సత్యాన్ని చెప్పడం కన్నా ఎక్కువగా వార్తని మాత్రమే వ్యాప్తి చేస్తుంటాం. పనిచేయకపోవడం అనేదొక అంటువ్యాధిలాంటిదనుకుంటే, పనిచేయడమనేది పండగ సందడి లాంటిది. రెండింటికీ కూడా త్వరత్వరగా వ్యాపించే గుణం ఉంది. 

మనం చెయ్యవలసిందల్లా ఎవరో ఒక పనిచేయని ఉద్యోగిని పనిచేసేటట్టు చేయ్యడం. లేదా, పనిచేస్తున్న ఉద్యోగి గురించో, పాఠశాల గురించో ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడటం. అది చాలు తక్కిన వాతావరణంలోని స్తబ్ధతనంతా తుడిచిపెట్టడానికి. అప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే, వింటూ ఉండగానే నీ చుట్టూ ప్రపంచం మాట్లాడే మాటలు ఒక్కసారిగా మారిపోయి వినిపిస్తాయి.

నేనటువంటి మార్పుని భూషణంగారిలో చూసి ఆశ్చర్యపోయాను. ఏనాడూ ప్రభుత్వ పథకాల్ని, ఉద్దేశ్యాల్ని నమ్మని భూషణంగారు ఒక రోజు నాతో తనొక కొత్త కథ రాసానని చెప్పారు. అప్పటికి ఆయన కథలు రాయడం మానేసి ఒక దశాబ్దం పైగానే గడిచిపోయింది. ఆయనతో తిరిగి కలం పట్టించిన ఆ సంఘటన ఇదీ :

గిరిజనప్రాంతాల్లో అత్యవసరమైన కేసుల్లో రోగుల్ని ఉన్నత అసుపత్రులకి పంపే చొరవ గిరిజనాభివృద్ధి సంస్ధలు తీసుకుంటుంటాయి. అలాగే మా సంస్ధ కూడా రోగుల్ని విశాఖపట్టణంలోని కింగ్‌జార్జి హాస్పటల్‌కి రోగుల్ని పంపించేది. అలా పంపిన ఒక గిరిజనుడికి ఒకసారి అత్యవసరంగా రక్తం అవసరమైంది. అతని బ్లడ్‌గ్రూప్ వెంటనే ఎక్కడా దొరకలేదు. వైద్యులు మా ప్రాజెక్టు అధికారికి సలహా కోసం ఫోన్ చేసారు. తీరా ఆయనా రోగిని చూడటానికి హాస్పటల్‌కి వెళ్లి చూస్తే తన బ్లడ్‌గ్రూప్ అతనికి సరిపోతుందని తెలిసింది. వెంటనే ఆయన ఆ గిరిజనుడికి తన రక్తాన్ని దానం చేసారు.

ఒక నాగరికుడు గిరిజనుడి కోసం రక్తదానం చేసాడన్న వార్త భూషణంగారిని చలింపచేసింది. అప్పటికి ఇరవయ్యేళ్ల కిందట, కొందరు నాగరికులు గిరిజనుల కోసం తమ రక్తాన్ని దానం చేసిన జ్ఞాపకాలింకా ఆయనలో పచ్చిగా ఉన్నాయి. ఆ రక్తదానానికీ, ఈ రక్తదానానికీ మధ్య ఆయనకేమీ తేడా కనిపించలేదు. దాని ఫలితమే ఆయన రాసిన ‘నమ్మిక’ కథ.

ఆ ఏడాది ఉపాధ్యాయదినోత్సవం పెద్ద ఎత్తున చేసాం. అప్పుడే మాకో ఊహ వచ్చింది. మా ఉపాధ్యాయులూ, పిల్లలూ రాసిన రచనల్తో ఒక మాగ్‌జైన్ తీసుకు రావాలనుకున్నాం. ఆ శీతాకాలమంతా ఆ ఏర్పాట్లతో గడిచిపోయింది. చక్కని అనుభవాలు చక్కని రచనలుగా మా ముందుకొచ్చాయి.

ఆ పత్రికకి ఏ పేరు పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడంతా ఏకాభిప్రాయంతో ఒకటే మాట చెప్పారు. దానికి ‘మా సంతోష చంద్రశాల’ అని పేరు పెట్టాలని. దాన్ని అవిష్కరించడానికి ఎవరిని ఆహ్వానించాలా అని ఆలోచించినప్పుడు ఎందరో కవులు, రచయితలు మా ఊహలో మెదిలి తరలిపోయారు.

జీవితమంతా కొన్ని విలువల్ని సామాజిక జీవితంలో నెలకొల్పాలని చూసిన వావిలాల ఒక్కరే ఆ ఆవిష్కరణకు అర్హులని మేం నిర్ణయించుకుని ఆయన్ని ఆహ్వానించాం. 1989 డిసెంబర్ 31 మరువలేనిరోజు. ఆ సాయంకాలం సంస్ధ అవరణలో పెద్ద ఎత్తున అవిష్కరణ సభ జరిగింది. వావిలాల ముఖ్య అతిథిగా గొప్ప ఉత్తేజకరమైన ప్రసంగం చేసారా రోజు.

ఆ మర్నాడు కొత్తసంవత్సరం మొదటిరోజు. ఆయన గిరిజన ప్రాంతాల్నీ, పాఠశాలల్నీ చూడాలని అభిలాష వ్యక్తం చేసారు. అప్పటికి ఇరవయ్యేళ్ల కిందట సాయుధపోరాటం జరుగుతున్న రోజుల్లోనో, అది ముగిసిపోయినప్పుడో ఆయన ఆ ప్రాంతాల్ని చూసారు. మళ్లా ఆ రోజే తిరిగి ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటన.

సహజంగానే నేనాయన రేగిడి పాఠశాలని చూడాలని కోరుకున్నాను. వెళ్లాం అక్కడికి. ‘గాంధీతాత గురించి వినడమే తప్ప ఆయన్ని చూడగలిగే అవకాశం లేని మనందరికీ ఈయనే గాంధీతాత’ అని చెప్పాను ఆ బాలికలతో. ఆ బాలికలు ఆ మహనీయుడి చుట్టూ చేరారు. వాళ్ల చిన్ని చిన్ని ప్రశ్నలకు జవాబిస్తో ఆయన వారితో చాలాసేపే గడిపారు.

తిరిగి వస్తూండగా అన్నారు నాతో. ‘గాంధీజీ జీవించి ఉండి ఉంటే ఈ పాఠశాలని చూసి ఎంతో గర్వించి ఉండేవారు’.

10

కన్నీళ్ల మధ్య

బహుశా ఇంక అక్కడ నేను చేయవలసిన పని ముగిసిపోయిందనుకుంటాను. ఆ తరువాత అనూహ్యవేగంతో సంఘటనలొక్కొక్కటే చకచకా సంభవించాయి. నవంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా ఉన్నతాధికారుల బదిలీలు మొదలయ్యాయి.

ముందు జిల్లాకలెక్టర్ బదిలీ. ఆయన తరువాత మా ప్రాజెక్టు అధికారి బదిలీ. సుబ్రహ్మణ్యంగారిని నేను కేవలం పై అధికారిగా ఊహించుకోలేను. ఆయన నన్ను స్వయానా తన సోదరుడుగానే చూసాడు. మేమిద్దరమూ కలిసి ఎక్కడికన్నా గిరిజన గ్రామాల్ని చూడటానికి వెళ్తే, తన కోసమే కాక నా కోసం కూడా ఆయన మధ్యాహ్న భోజనం పట్టుకొచ్చేవాడు.

నాకు మలేరియా వచ్చినప్పుడు ఆయనే నన్ను వెంటబెట్టుకుని కింగ్ జార్జి హాస్పటల్‌కి తీసుకువెళ్లాడు. విశాఖపట్టణంలో ఆ మధ్యాహ్నం కారులో నేను లేవలేని పరిస్ధితిలో ఉండగా, ఎండవేళ ఆయన రోడ్డు దాటుకుంటూ వెళ్లి నా కోసం మందులు కొని తెచ్చిన   ఆ దృశ్యాన్ని నేను ఎన్నటికీ మరవలేను.

రెండేళ్లకు పైబడి మేమక్కడ రెండు శరీరాలు, ఒక్క హృదయంతో పనిచేసాం. అటువంటిది ఆయన బదిలీ మీద వెళ్లిపోవడం నాకు పెద్ద  ఆఘాతం.

ఆ తరువాత, నా మీద విరుచుకుపడిన రాజకీయశక్తుల్ని నేనొక్కణ్ణీ నిలవరించు కోలేనని నాకు బోధపడింది. అది నా మొదటి పోష్టింగ్. నేనా రెండేళ్లుగా పని గురించి వాస్తవాల్నే బోధపరుచుకుంటూ ఉన్నాను గానీ, ప్రభుత్వం గురించిన వాస్తవాల్ని బోధపరుచుకోనేలేదు.

ప్రభుత్వమనేది కిందనుంచి పైదాకా పొరలుపొరలుగా పేరుకుని ఉంటుందనీ, వివిధ స్ధాయిల్లో అది వివిధ రకాలుగా స్పందిస్తుందనీ, సమస్యని అది సమీపించే తీరులో ఏ స్ధాయి ప్రతిస్పందన ఆ స్ధాయికే పరిమితమనీ కూడా నేను గ్రహించలేకపోయాను. సుబ్రహ్మణ్యంగారు ఉన్నప్పుడు ఆయన నాకొక షాక్ అబ్జార్బర్‌గా పనిచేస్తుండేవారని నేనప్పుడు తొలిసారిగా గ్రహించాను.

ఆయన కల్పించిన భద్రత నీడన, నేనూ, నా పాఠశాలలూ మా పని మేం నిరాటంకంగా చేసుకోగలిగామని కూడా తెలియవచ్చింది. కాని తను వెళ్లిపోతే, నేనొక్కడినే ఉండవలసి వస్తే, నేనెలా నడవవలసి ఉంటుందో ఆయన ఊహించనూ లేదు, అందుకు కావల్సిన శిక్షణ కూడా నాకు ఇవ్వలేదు.

కొన్ని రోజుల కలవరం తరువాత, సంఘర్షణ తర్వాత నా శ్రేయోభిలాషులంతా నన్ను దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లిపొమ్మని సలహా ఇచ్చారు. ప్రభుత్వోద్యోగి ఎల్లకాలం ఒక్కచోటనే పనిచేయడం అసాధ్యమనీ, నేడు కాకపోతే రేపన్నా వెళ్లిపోవలసి ఉంటుందనీ, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, సెలవు మీద వెళ్లిపోవడమే మేలని వారి వాదన. కొన్నాళ్లు ఎటూ తేల్చుకోలేకపోయాను.

అటువంటి రోజులలో ఒకనాడు నేను కొదమ గ్రామాన్ని సందర్శించాను. చోర, కొదమ సాలూరు, మక్కువ మండలాలు కలిసే సరిహద్దుల్లో మహాపర్వతశ్రేణుల మీద మహారణ్యమధ్యంలోని గ్రామాలు. దానిపాటికదొక ప్రపంచమనే అనవలసి ఉంటుంది. నేనా గ్రామాన్ని చేరేటప్పటికి చీకటి పడింది. నా రాకని ఆ రాత్రి ఆ గిరిజన సమాజం పండగ చేసుకుంది.

నిండుపున్నమి రాత్రి. బాజాలు మోగాయి. పీరూడి ఊదారు. ఆడా, మగా నృత్యం చేసారు. ఆ గ్రామపెద్ద సావొతా నాకోసం తన ఇంటిలోని శయ్యనిచ్చి ఆ చలిరాత్రి మరొక చిన్నగదిలో గడిపాడు.

ఆ పొద్దుటనే ఆ ఊరి పాఠశాలను చూసాను. అది మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాల. అప్పటికి కొన్ని నెలలుగా ఆ పాఠశాలలో అడుగుపెట్టని ఆ ఉపాధ్యాయుడు నేను వస్తున్నానని తెలిసి ముందు రోజే కొండ ఎక్కి గ్రామానికి రొప్పుకుంటూ వచ్చాడు. నాకొక చక్రభ్రమణం పూర్తయినట్టనిపించింది. ఎక్కడ మొదలు పెట్టానో, చివరికి అక్కడికే వచ్చి ఆగాను. 

తిరిగి రాగానే నా ఉద్యోగానికి దీర్ఘకాలపు సెలవు పెట్టేసాను. ఆ వార్త బయటకి పొక్కడానికి కూడా వీల్లేని పరిస్ధితి. ఏదో వంక పెట్టి ప్రధానోపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసాను. నా నిర్ణయాన్ని వాళ్లకు ప్రకటించాను. అందరి కళ్లల్లో నీళ్లు. కొందరు ఆవేశం అపుకోలేక బిగ్గరగానే విలపించడం మొదలుపెట్టారు.

నా దృష్టి అక్కడ లేదు. నేనాలోచిస్తున్నదల్లా, నా చివరి కోరిక, వెళ్లిపోయే ముందు ఒక్కసారి, కనీసం దూరం నుంచయినా, రేగిడి పాఠశాలని చూడగలనా? కానీ అప్ప్పుడున్న పరిస్ధితిలో అది అసాధ్యం. అక్కడికి వెళ్ళాలంటే ముందు పార్వతీపురం దాటాలి. అప్ప్పుడు కురుపాం. ఆ మీదట గుమ్మలక్క్ష్మిపురం పోయే దారిలో  మూలిగూడ జంక్షన్ నుంచి గొరడ దారి పట్టాలి. గుగ్గిలం చెట్ల దండకారణ్యంలో, దుడ్డుఖల్లు మలుపు బాటన గుమ్మిడిగెడ్డ దాటాక గాని చూడలేం ఆ పాఠశాలని. అంత అవకాశం ఎక్కడిది?

కానీ అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది.

నేను పార్వతీపురం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండగా, ఐఫాడ్ మిషన్ బృందం ఒకటి పార్వతీపురం వచ్చింది. వారికి ఆ ప్రాంతం గురించి అధ్యయనానికి సహకరించ డానికి ఆ ప్రాంతం గురించి తెలిసినవారెవ్వరూ సంస్ధలో సిద్ధంగా లేరు. వాళ్లు నన్ను వెతుక్కుంటూ నా క్వార్టర్స్‌కి వచ్చారు. నేను సెలవు మీద వెళ్లిపోతున్నాననీ, సంస్ధ ఉద్యోగిని ఇంకెంతమాత్రం కాననీ వారికి చెప్పాను. కానీ వారు నన్ను వదల్లేదు. ఉద్యోగిగా కాక, స్వచ్ఛంద కార్యకర్తగా తమకి సహకరించమన్నారు. ఇంకేముంది? మళ్లా ఆ కొండల మధ్యకి, ఆ అడవుల మధ్యకి, మా మొదటి పర్యటన రేగిడికే.

తమ పాఠశాలలో జీప్ ప్రవేశిస్తున్న చప్పుడు విన్నారో లేదో ఆ బాలికలంతా ఒక్క ఉదుటున తరగతి గదులు వదిలి నా జీప్ చుట్టూ మూగిపోయారు. ఆ ఉదయాన్నే ప్రేయర్ అసెంబ్లీలో ప్రధానోపాధ్యాయుడు అనౌన్స్ చేసాడట. నేను వెళ్లి పోతున్నానని. తమని చూడకుండా నేనక్కణ్ణుంచి వెళ్లలేనని ఆ పసిహృదయాలకెంత నమ్మిక ! వాళ్ల అభిమానమే నాకా చివరి సందర్శనాన్ని సాధ్యం చేసింది.

వదిలిపెట్టాను ఆ కొండల్ని కన్నీళ్ల మధ్య. రెండేళ్ల కాలమెంత అవ్యవధిగా గడిచిపోయింది. ఇంకా ఆ తొలిరోజు కూనేరు మీద కమ్ముకున్న ఆషాడమేఘాలు, ఆ జరడ, టొంపలపాడుల్లో నిదురించిన ఆ చలిరాత్రులు, ఆ కొత్తవలస, కురుకుట్టి పాఠశాలల్లో పిల్లలు పాడిన పాటలు, ఆ ఒబ్బంగి, నీలకంఠాపురం ఆశ్రమ పాఠశాలల కోసం మేం కన్న కలలు, ఆ యండభద్ర పాఠశాలలో పిల్లలతో కలిసి వినాయక చవితికి పత్రి తెచ్చుకున్న ఆ సంధ్యావేళ, ఆ కోసింగిభద్ర, కేదారిపురం పాఠశాలలు, ఆ సొబ్బ, పొడి, ఆ కొండ చిలకం పాఠశాలల్లో నేను చేసిన రాత్రి బసలు, అవన్నీ నాలో ఇంకా కొత్తగా మాయకుండానే ఉన్నాయి.

ఆ జ్ఞాపకాలు కళ్లని కన్నీళ్లతో మసకబారుస్తుండగా, పొరలి పొరలి వస్తున్న ఉద్వేగానికి గుండెని చిక్కబట్టుకుని, వదిలిపెట్టేసాను ఆ ప్రాంతాల్ని, ఒక జీవితకాలానికి.


9

Our Pavilion of Joy

Our Project Officer decided that the tenth-grade examination results achieved by our Tribal Welfare Ashram Schools and Residential Schools should be celebrated on a grand scale. He insisted that the function be held not in Parvathipuram, but in Vizianagaram itself. He believed that such a prominent venue was the right platform to share our joy with the public and to showcase the remarkable progress these schools had made despite the severe hardships of the remote forests.

In highlighting this progress, he did not wish to limit the honor to Tribal Welfare Schools alone. Regardless of institutional management, the hardship of tribal regions was the same everywhere. Therefore, he was eager to honor teachers from other managements also who had made outstanding contributions in these areas.

Years ago, a teacher named Akundi Narayana Murthy had served in the Zilla Parishad schools in the Makkuva region of Vizianagaram district. I had met him only once. Besides being a gifted short story writer, he had dedicated his entire life to collecting and preserving tribal literature, particularly that of the Jatapu community.

To honor his legacy, we decided to institute the “Akundi Narayana Murthy Memorial Gold Medal” for any non-Tribal Welfare teacher who had rendered extraordinary service to Adivasi education. For the very first medal, the headmaster of the Mondemkhallu Zilla Parishad High School was chosen.

In truth, the work done by the staff of our Tribal Welfare educational institutions cannot be captured by a mild word like “effort.” It was nothing short of sacrifice.

In Dharmalaxmipuram, the government had built a housing colony for the Adivasis. Because of poor construction quality, the villagers refused to move into those houses. Left abandoned, the structures were slowly crumbling away. It was in these very dilapidated houses that the teachers of the Tribal Welfare High School lived and worked, creating history in the field of Savara education. How could any formal award ever truly honor such sacrifice?

Nevertheless, our Project Officer spared no effort. He erected a pandal as vast as the sky and turned that academic success into a magnificent festival. Unfortunately, I was unable to witness the event.

Two weeks prior to the celebration, while touring the remote hill village of Miliyakanchuru in the Pachipenta mandal, I was struck down by malaria. It was no ordinary strain, but Blackwater Fever—the very name of which once made European civil servants in tropical Asia tremble. It confined me to bed for two full months and drained every ounce of my strength. My liver was severely damaged, and I must admit it has never fully recovered from that illness to this day. I could only send my blessings and good wishes to the teachers and students from my sickbed.

As the 1989–90 academic year began, we turned our attention to several other schools. Tikkabai in Gummalaxmipuram mandal, Ravada and Ramabhadrapuram in Jiyyammavalasa mandal, Dokiseela in Parvathipuram mandal, Ulipiri in Komarada mandal, Yerrasamantavalasa in Makkuva mandal, and Thonam in Salur mandal were all lifting their heads, waiting for our call. Above all, we placed our highest hopes on the Regidi school.

Regidi was a village situated deep in the interior of the Gummalaxmipuram mandal. In the early days of the ITDA, a former Project Officer, driven by noble intentions, had started an ashram school there specifically for Adivasi girls.

He had likely envisioned creating a quiet Shantiniketan for tribal girls in the lap of a forest untouched by the influences of the modern world. In practice, however, the outcome was quite the opposite. For six months of the year, the village had no motorable road, and consequently, neither the village nor the school received any visitors. With a complete lack of basic amenities, no teacher was willing to serve in such isolation.

For a long time, we deliberated on how to reform this school. Our discussions yielded no clear path forward. At one point, we even considered shifting the school out of Regidi to Gummalaxmipuram.

However, our Project Officer preferred to keep the school in its original location and take it up as a challenge. A series of systematic steps followed. We approached Sri Sitaramamurthy—the most senior, flawless, and capable teacher in our agency—and requested him to take charge as the headmaster. He graciously accepted our request and assumed responsibility for the school.

The second hurdle was the presence of a Mandal Primary School within the very same compound. Government rules do not permit setting up an exclusively girls’ school at the primary level. Yet, our firm objective was that not a single boy should remain within that compound. Through the personal initiative of the District Collector, this hurdle was eventually cleared. Shaking off the slumber of many years, the school began to move forward rapidly, step by step.

We enrolled not only the local girls but also girls from surrounding villages. Once, while touring a nearby village, when our Project Officer appealed to the elders to send their daughters to the Regidi school, an Adivasi employee remarked that Regidi was a place far removed from civilization.

A brief debate then ensued between the two of them on what truly constituted civilization. Interestingly, the discussion eventually settled on the choice of clothing for the girls. The Adivasi employee reportedly asked, “If girls study in towns, they prefer to wear Punjabi dresses. But in that remote village, won’t they always be forced to wear the old-fashioned uniforms you supply?”

Our Project Officer responded to his remark with great sensitivity. In truth, back then, we only supplied cotton-printed frocks or skirt-and-blouse sets to the children. There were no government orders permitting the distribution of Punjabi dresses.

He selected two girls from the school and sent them to Vizianagaram along with the matron. He requested  his wife also to accompany them. There, he had two sets of dresses stitched for every single girl, allowing them to choose the exact designs and varieties they desired. This might seem like a minor detail today, but back then, in building trust and boosting the self-esteem of those young girls, its impact was immense.

While we devoted personal attention to a few selected schools, many other schools began to blossom entirely on their own, without waiting for any call from us.

Among them, the P. Konavalasa Residential School deserves special mention. Its principal, Sri Sambamurthy, belonged to the older generation of residential school teachers and had previously worked under Sri C.S. Rao. By observing him, I learned what it truly meant for the head of an institution to be a dedicated worker (karyaseeli). Whenever materials were allotted to the school, he would go directly to the godown and bundle the supplies himself. If necessary, he would carry the loads on his own head. Situated on the main road connecting Salur to Jeypore, P. Konavalasa became a model demonstration school for the entire region through his tireless efforts.

Amidst the changing seasons, cradled in the lap of lush green nature, schools were growing just like children. Just as a parent notices every subtle stage of a child’s growth, we could sense the gradual awakening of these schools. They responded directly to human care and consciousness.

In this context, the words of a Horticulture Officer often come to my mind. Our agency maintained a Horticulture Nursery-cum-Training Center (HNTC) in Savarakotapadu, a village in the Gummalaxmipuram mandal. The officer in charge once remarked to me, “Plants speak to us, sir—especially growing plants. Out of the thousands of saplings in this nursery, whenever I go on my daily rounds, my feet will involuntarily stop right in front of the specific plant that has a problem.”

Nurturing and caring for schools is no different. They speak to us. They wait for us. They nod their heads in greeting. They laugh cheerfully. Slowly, the poets and singers hidden among our teachers began to express themselves.

The Tikkabai Ashram School used to echo with the songs composed by Ganteda Gourunaidu, who is today recognized as one of Kalingandhra’s foremost story writers. As the children sang his songs melodiously, the sweet fragrance of Mahua (Ippa) flowers floated through the air. There were others too—Ganapathi, D. Venkatrao (affectionately known as ‘Aapta Chaitanya’), and many more.

What began as an educational cell to prepare introductory material on tribal culture for newly appointed teachers soon blossomed into a full-fledged Tribal Educational Planning Center. Today, this center stands as the original model for the Project Monitoring and Resource Centers (PMRC) that manage the planning and monitoring of tribal education across all agency areas in the state.

Sri Bagatha Satyanarayana, who was serving as the headmaster of Dokiseela at the time, managed this educational wing. The wing also undertook an ambitious initiative to select outstanding literary works from various languages and translate them into Savara and Kui languages, supported by a small reference library.

Gradually, not only our own institutions but also non-agency schools and teachers began seeking our guidance and collaboration. Two or three individuals deserve special mention here.

Sri Nerella Narayanamurthy took it upon himself to teach Sanskrit to Adivasi students. In recognition of his dedicated efforts, the Zilla Parishad entrusted him with the management of the Zilla Parishad Sanskrit School in Parvathipuram, which was then on the verge of closure due to low enrollment. He approached our agency for support, and through our collective efforts, that school stands today as one of the most prestigious institutions in the Vizianagaram district.

Another notable figure was Sri P. Parinaidu, who later played a pioneering role in the Total Literacy Campaign. At that time, he was working in Gorada and served as a steadfast pillar of support for every initiative we undertook at the Regidi school. Being a devoted disciple of Sri Vavilala Gopalakrishnayya, he drew inspiration from his mentor to launch a grassroots movement for complete prohibition of alcohol in the tribal areas.

Sri Nagarjuna, who taught Political Science at Sri Venkateswara Degree College in Parvathipuram, also stood by our agency as an academic guide, philosopher, and trusted companion.

Thus, in a matter of days, the agency completely transformed the atmosphere throughout the tribal region. My conviction is that when people claim schools are functioning or not functioning, they are often merely spreading rumors rather than stating the objective truth. If administrative apathy is like an infectious disease, constructive work is like the joyful bustle of a festival. Both possess the quality of spreading rapidly.

All we need to do is inspire one indifferent employee to work, or speak about a dedicated teacher or a thriving school so loudly that the world takes notice. That alone is enough to sweep away the surrounding stagnation. Then, right before your eyes, you will hear the tone of the conversation around you shift entirely.

I was astonished to witness such a transformation in Bhushanam. Bhushanam, who had never harbored any faith in official schemes or government intentions, came to me one day and said he had written a new short story. More than a decade had passed since he had stopped writing fiction. The incident that compelled him to pick up his pen once again was this:

Tribal development agencies routinely take the initiative to transport critical patients from remote hills to tertiary hospitals. Similarly, our agency used to send serious cases to the King George Hospital in Visakhapatnam. Once, an Adivasi patient sent there urgently required a rare blood group that could not be secured anywhere in the city. The attending doctors telephoned our Project Officer for advice. When he went to the hospital to visit the patient, he discovered that his own blood group matched that of the Adivasi man. Without a second thought, he donated his blood to save the man’s life.

The news that a senior officer from civilized society had donated his blood for a tribal person deeply moved Bhushanam. Twenty years earlier, during the height of the struggle, idealistic young people who turned into Naxalites and laid down their lives had shed their blood for the Adivasis, and those memories were still fresh in his heart. He saw no difference between that sacrifice and this act of quiet humanity. The outcome of that awakening was his story, Nammika (“Trust”).

That year, we celebrated Teacher’s Day on a grand scale. It was then that a new idea struck us: we decided to bring out a magazine comprising literary contributions from our teachers and students. That entire winter was spent making arrangements. Pure human experiences took shape as wonderful pieces of writing before us.

Whenever the question arose as to what we should name the magazine, everyone spoke with one voice. They unanimously insisted that it should be named Maa Santhosha Chandrasala (“Our Pavilion of Joy”). When we deliberated on whom to invite for its launch, the names of many eminent poets and writers crossed our minds and faded away.

In the end, we decided that Sri Vavilala Gopalakrishnayya—a man who had spent his entire life striving to establish moral values in public life—was the only person truly worthy of launching it. We invited him. December 31, 1989, remains an unforgettable day. That evening, a grand public function was held in the agency compound, where Vavilala delivered a deeply inspiring address as our chief guest.

The next day was New Year’s Day. He expressed a desire to visit the tribal hamlets and schools. He had last toured these border forests twenty years earlier, during the turbulent days of the armed struggle and its immediate aftermath. Now, after two decades, he was treading those paths once again.

Naturally, I wished to take him to the Regidi school. We traveled there together. Addressing the young girls, I said, “For all of us who have only heard of Gandhi Tatayya (“Grandpa Gandhi”) in books but never had the fortune of seeing him, this elder is our living Gandhi Tatayya.” The girls gathered around that noble soul. He spent a long time answering their innocent, little questions with immense patience and love.

As we were returning, he turned to me and said, “If Gandhiji were alive today, he would have been immensely proud to see this school.”

10

Amidst a Haze of Tears

Perhaps my work in those hills had reached its natural end. Soon after, events began to unfold one after another with dizzying speed. Following the formation of a new state government in November, a series of administrative transfers of senior officers commenced.

First came the transfer of the District Collector. Shortly thereafter, our Project Officer was transferred as well. I could never view Sri Subrahmanyam merely as an administrative superior; he treated me as if I were his own brother. Whenever the two of us set out together to visit remote Adivasi hamlets, he would thoughtfully pack lunch not just for himself, but for me as well.

When I was struck down by severe malaria, it was he who personally escorted me to the King George Hospital in Visakhapatnam. I can never forget that blazing afternoon in Visakhapatnam—as I lay in the back of the car, completely incapacitated by fever, I watched him walk across the hot, sun-baked road to fetch medicines for me.

For over two years, we worked together in those forests like two bodies guided by a single heart. His sudden transfer came as a devastating blow to me.

In his absence, I quickly realized that I could not single-handedly withstand the political pressures that began to descend upon me. This had been my very first official posting. Over those two years, I had learned a great deal about the real work on the ground, but I was still entirely ignorant of the harsh political realities of governance.

I had not yet understood that the institution of government is built in complex, layered tiers from bottom to top—that it responds differently at each level, and that its capacity to address a problem is strictly limited by the perspective of that specific tier. It was only then that I truly grasped how Subrahmanyam had acted as a constant shock absorber for me.

I came to realize that it was under the quiet shield of protection he provided that I and my schools were able to carry out our work without hindrance. But once he was gone, leaving me to stand alone, I found myself unprepared; he had neither anticipated how I would have to navigate the path by myself, nor had he trained me for it.

After days of deep inner turmoil and conflict, my well-wishers advised me to proceed on long leave. They argued that a civil servant cannot remain in one place forever—that if not today, one must inevitably move on tomorrow—and that it was far wiser to take leave without dwelling on it further. For several days, I remained undecided.

It was during those uncertain days that I visited the village of Kodama. Chora and Kodama are hamlets tucked deep within the dense forests of the grand mountain range where the borders of Salur and Makkuva mandals meet. It was, in every sense, a world unto itself. Night had already fallen by the time I reached the village. Upon my arrival, the entire Adivasi community came together to celebrate the occasion like a festival.

It was a brilliant full-moon night. Drums resounded through the air, and they played the peeroodi (flute). Men and women danced together in joy. Savota, the village elder, offered me their only room under a roof for the night, while he spent that freezing night in a tiny adjacent shelter.

The following morning, I visited the local primary school, run by the Mandal Praja Parishad. The teacher, who had not set foot in the school for months, had learned of my visit and climbed the steep hill the previous evening, arriving at the village out of breath. Sitting there, I felt as though a full circle had been completed. Where my journey had begun, there it had finally come to a rest.

Upon returning to headquarters, I submitted my application for long leave. The situation was so delicate that the news could not even be leaked outside. On some official pretext, I convened a meeting of all the headmasters and announced my decision to them. Tears welled up in everyone’s eyes; unable to contain their grief, a few began to weep aloud.

Yet my mind was elsewhere. My only lingering desire before leaving was whether I could see the Regidi school just once more, even if only from a distance. But under the circumstances, that seemed well-nigh impossible. To reach Regidi, one had to cross Parvathipuram, proceed toward Kurupam, and at the Mooliguda junction along the Gummalaxmipuram road, take the dirt track toward Gorada. Only after crossing the Gummidi stream along the winding path of Duddakhallu, deep within the Dandakaranya forest of Guggilam trees, could one catch a glimpse of the school. Where was the opportunity for such a journey now?

Yet, unexpectedly, that opportunity presented itself.

Just as I was preparing to depart from Parvathipuram, an appraisal mission from the International Fund for Agricultural Development (IFAD) arrived in town. Since no officer in the agency was readily available to assist them in exploring the interior region, they came looking for me at my quarters. I explained that I was proceeding on leave and was no longer functioning as an agency officer. But they insisted, requesting me to accompany them not in an official capacity, but as a volunteer guide.

What more could I have asked for? Once again, I was heading back into those hills and forests—and our very first stop was Regidi.

The moment the jeep entered the school premises, hearing the familiar sound of the engine, all the young girls rushed out of their classrooms and crowded around the vehicle. The headmaster had announced during the morning assembly that I was leaving that particular station. How much innocent faith those young hearts harbored—believing with certainty that I would never leave without coming to say goodbye to them! Their pure affection had made that final visit possible.

I took leave of those hills amidst a haze of tears. How seamlessly those two years had slipped by. Yet, the memory of the Ashadha monsoon clouds gathering over Kuneru on my very first day, those freezing nights spent sleeping in Jarada and Tompalapadu, the songs sung by the children in the Kothavalasa and Kurukutti schools, the dreams we nurtured for the Obbangi and Neelakanthapuram ashram schools, that quiet twilight when I accompanied the children of the Yandabhadra school into the forest to gather wild leaves (patri) for Vinayaka Chavithi, the remote schools in Kosingibhadra, Kedaripuram, Sobba, and Podi, and the night halts at the hill school of Chilakam—all of them remained as fresh, unblemished, and vivid within me as ever.

As these memories blurred my eyes with tears, holding back a heart overflowing with emotion, I left those hills behind—leaving behind a place that would live within me for a lifetime.

22-7-2026

8 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-15”

  1. విభూతి భూషన్ వంద్యోపాధ్యాయ ఆరణ్యక నవల చదివినప్పటి స్పందన, అనుభూతి కలిగిస్తోంది ఈ యదార్ధ గాథ

  2. 87-88 విద్యాసంవత్సరం లో పదవతరగతిలో వచ్చిన 504 మార్కులు తెచ్చుకుని స్కూల్ ఫస్ట్ గానే కాక, చుట్టు పక్కల 7-8 మండలాల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు మా మొండెంఖల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూరెళ్ల శేషగిరిరావు గారు స్కూల్ అసెంబ్లీ లో ఈ విషయం ప్రకటించి నాకు ఒక పెన్ను బహుమతి గా ఇచ్చిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకం.

    బహుశా తర్వాత ఆకుండి నారాయణమూర్తి స్మారక బంగారు పతకం మా స్కూల్ హెడ్ మాష్టారు గారే అందుకోవడం చాలా సంతోషం.

    ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారికి, మీకు ఎంతో ఇష్టమైన రేగిడి స్కూలు అప్పటి విద్యార్థినులు గీత, జ్యోతి అనే (తర్వాత టీచర్లు అయ్యారు) మిమ్మల్ని ఇద్దరినీ విజయవాడలో కలిసినప్పుడు, ఆ రేగిడి స్కూల్ జ్ఞాపకాలు, వాళ్ళకు పంజాబీ డ్రెస్సులు కుట్టించడం అన్నీ తలచుకోవడం నాకింకా గుర్తుంది.

    పార్వతీపురం ఐ.టి.డి.ఏ లో ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు, మీరు మా గిరిజన విద్యార్థుల పై చూపించిన అవ్యాజమైన ప్రేమ, మా చదువుల గురించి వేసిన బాటలే … ఇప్పటి మా జీవితాలకు, అభివృద్ధి కి కారణభూతమయ్యాయి.

    1. చాలా సంతోషం సోమశేఖర్! యథార్థానికి మీ వంటి వారి వల్లనే ఆ ప్రాంతాలకి భవిష్యత్తు పట్ల ఒక ఆశ దొరికింది. లేకపోతే ఇంకా ఆ ప్రాంతాలు ప్రాణత్యాగాలు చేస్తూనే ఉండేవి.

  3. Thank you for this post, sir! Last week, I happened to visit a primary school in our village- I mean the place I live in- Tikiri, Odisha. This tribal village has been my home for a few years now; every word you wrote reflects my experiences with the school and kids.

  4. “మా సంతోష చంద్రశాల”
    ఎంత అందమైన పేరు!

    గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త అయిన వావిలాల గోపాలకృష్ణయ్య గారిని పత్రికావిష్కరణకు ఆహ్వానించడం, ఆ తర్వాత రేగిడి పాఠశాలలో బాలికలకు “ఈయనే మన గాంధీతాత” అని పరిచయం చేయడం! ఆ బాలికలెంత అదృష్టవంతులు!!

    తిరిగి వస్తూ ఆయన “గాంధీజీ జీవించి ఉండి ఉంటే ఈ పాఠశాలని చూసి ఎంతో గర్వించి ఉండేవారు” అనడం
    I think that was one of the greatest recognitions your collective effort could have received, Sir.

    సుబ్రహ్మణ్యం గారి గురించి మీరు చెప్పిన విషయం చదివి, రెండేళ్ల వ్యవధిలోనే ఒక ప్రాంతం, ఒక విద్యా వ్యవస్థ, వందలాది పిల్లల జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకురావచ్చో మీరిద్దరూ కలిసి చేసి చూపించారు. Leadership in its real sense!! 🙏🏽

    Sir, the person you are, with your deep commitment to your values, your integrity, and your conviction!
    And the writer you are with your extraordinary ability to transform your experiences into words that leave a lasting impression!!

    This book is a beautiful blend of both the person you are and the writer you are, Sir.

    🙏🏽🙏🏽🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading