
పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశంలో రెండవభాగం గురించిన ప్రసంగం. ఈ రోజు 33 నుండి 44 వ శ్లోకందాకా ముచ్చటించాను. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
Featured image courtesy: pexels.com
10-10-2025
chinaveerabhadrudu.in

పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశంలో రెండవభాగం గురించిన ప్రసంగం. ఈ రోజు 33 నుండి 44 వ శ్లోకందాకా ముచ్చటించాను. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
Featured image courtesy: pexels.com
10-10-2025
Just finished listening to this week’s wonderful talk in this unforgettable series sir!!
ఈ కావ్యం లోని శ్లోకాలు విప్రలంభ శృంగారం లా మాత్రమే చదువుకున్నట్లయితే యక్షుడు చెప్తున్న మాటల వెనుక ఉన్న విశ్వాసం, mutual trust, వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం వల్ల వచ్చిన వియోగ మాధుర్యం అన్న కోణాన్ని మిస్ అయిపోతాం. కానీ మీరు చూపించినట్టు , ఆ nuancesను అర్థం చేసుకున్నప్పుడు another perspective కనిపిస్తుంది, Sir.
సరస్సులో చేపపిల్ల తోక తగిలి కలువ పువ్వు ఎలా కదులుతుందో ఆమె కళ్ళు అలా అదరడం
లలితా నామాలలో కదిలే చేపపిల్ల వంటి కన్నులు కలిగిన అమ్మవారు
ఈ పోలిక చాలా అందంగా ఉంది.
పూర్వ మేఘంలో పరమశివుడు సంధ్యానాట్యం చేస్తున్నప్పుడు ఆ magnificence ని చూపడానికి “భుజ తరూవనం” అన్న గంభీరమైన మాట వాడడం
ఉత్తర మేఘం లో యక్షిణి సుకుమారమైన “భుజ లతా” న్ని లతలతో పోల్చడం లోని ఔచిత్యాన్ని, contrast ని చూపించారు.
ఇక్కడ మాలతీ పూవుల మీద నండీ వీచే గాలి!
రామాయణం లో మొగలిపువ్వుల మీద నుండీ వీచే తొలి వానాకాలపు గాలి!!
Sir, if you didn’t point out such parallels every where all along, I wouldn’t never have known them. Parallels like these really enhance కావ్యానందం. 🙏🏽
“అటువంటి (మొగలి పొదల మీద నుండి వీచే తొలి వానాకాలపు) గాలి ని దోసిళ్ళతో తాగాలనుందని రాముడంటాడ”న్నారు.
Spell bound ఈ expression విని!!
వాల్మీకి రామాయణం లో ఎంతెంత సౌందర్యాన్ని పొదివి పెట్టారో !! I humbly request and pray that you do a similar series on వాల్మీకి రామాయణం!!
మీరు ఇప్పటికే ఆ ప్రసంగాలు చేసివుంటే నాకు తెలియదు. మన్నించాలి.
“అవిధవే“, “అంబూవాహం “ వంటి సార్థక పదప్రయోగాల గురించి, ఎలా ప్రాచీన కవులు communication ని అర్థవంతంగా sambodhanalu ద్వారా నిర్మించారో చర్చించడం చాలా బాగుంది, sir.
కావ్యమంతా ఎక్కడెక్కడ కాళిదాసు వాల్మీకి సుందరకాండ స్ఫూర్తితో రాశారో చెప్తూ, యథాతథంగా కొన్ని ఉపమానాలను తీసుకున్నట్లు చెప్పినప్పుడు, it was very enlightening. Also it felt like Kalidasa kavi was paying a literary homage to Valmiki maha kavi, borrowing similar expressions in reverence.
I was very happy to see that he acknowledges that influence directly, in the line “హనుమంతుని చూసిన మైథిలి వలె”. Truly an amazing, Sir!
మీరు చెప్పినట్లు Chinese poetryలో “jade” అన్న పదాన్ని ఎలా రకరకాల అర్ధాలతో ఉపయోగిస్తారో, ఇక్కడ మన కవి “శ్యామ” అనే పదాన్ని చాలా చోట్ల వాడతాడు – these observations were very insightful.
ఈ 43 శ్లోకమే చాలా beautiful గా వుంది. హే చండీ!! 😃 అన్న పదప్రయోగం showing Yaksha’s intense love and longing for his wife is beautifully written.
Once again, thank you for this extraordinary journey through Meghasandesam, sir!!
కావ్యానందాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పిస్తున్నారు 🙏🏽🙏🏽🙏🏽
రెండు రోజులుగా మీ స్పందన కోసమే ఎదురు చూస్తున్నాను. చాలా మాటలు ప్రసంగవశాత్తూ అప్పటికప్పుడు స్ఫురిస్తున్నవి శ్రోతలు ఎంతవరకు గమనిస్తున్నారో అని అనుకుంటూ ఉంటాను. కానీ మీరు అటువంటి insights ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఇలా తిరిగి పంచుకోవడం నాకు చాలా సంతోషంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉంది.
వాల్మీకి రామాయణం మీద మాట్లాడగలిగే స్థాయి కలిగిన వాడిని కాదు గాని రామాయణంలో ఋతువర్ణనల మీద మాత్రం ప్రసంగాలు చేయొచ్చని ఇప్పుడు అనిపిస్తోంది.