సంతోషం ఒక క్రియాపదం

గొప్ప యోగుల, ఋషుల, దార్శనికుల, చింతకుల, బోధకుల, సాధకుల రచనలు కూడా మనల్ని ఎప్పటికప్పుడు పడిపోకుండా నిలబెడుతూ ఉంటాయి. అటువంటి మహాత్ముల రచనలు చదివినప్పుడు రాసుకుంటూ వచ్చిన నలభై వ్యాసాల సంపుటి ఇది. పరమయోగి శ్రీ వై.హనుమంతరావుగారి దివ్యస్మృతికి ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను. దీన్నిక్కడ మీరు డౌనులోడు చేసుకోవచ్చు. ఇటువంటి ఆసక్తి ఉన్న మిత్రుల్తో పంచుకోవచ్చు. ఇది నా 65 వ పుస్తకం.

ఒక సంభాషణ-3

కస్తూరి మురళీకృష్ణగారు, కోవెల సంతోష్ కుమారు గారు 'స్వాధ్యాయ-కోవెల ' ఛానెలు కోసం నాతో మాట్లాడించినప్పుడు మా మాష్టారి గురించీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించీ మాట్లాడిన మాటలు ఇలా విడిగా ఒక ఎపిసోడుగా తమ ప్రేక్షకులతో పంచుకున్నారు. నారాయణాచార్యులు గారు సరస్వతీ పుత్రులు. మా మాష్టారు పుంభావ సరస్వతి. వారిద్దరి గురించి ఎంతసేపేనా తలుచుకోవచ్చు. ఆ సంభాషణని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

ఒక సంభాషణ-2

కస్తూరి మురళీకృష్ణ, కోవెల సంతోష్ కుమారు గారులు నాతో మాట్లాడించిన సంభాషణల్లో రెండవ భాగం నిన్న నాకు పంపించారు. ఆ వీడియో లింకును ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.