
నాకో ఉత్తరం రాసుకొచ్ఛి
నలుగురూ వినేలా
వీథిలోనే చదివి వినిపిస్తుంది
వసంతవాన.
ఇలా వచ్చినట్టే వచ్చి
ఉత్తరం చదివి వినిపించి
అలా వెళ్ళిపోయాక వీథుల్లో
దుమ్ము కూడా పరిమళిస్తుంది.
చూస్తున్నాను కదా
వసంత ఋతువు ప్రతిసారీ
నా మనసు తడిపి
సాంగత్యాల మరకలు తుడిచేస్తుంది.
అప్పుడు గానీ పలకరించదు
వీథి చివర దేవగన్నేరు.
లోకానికి నా వీపు తిప్పేదాకా
కోకిల ఒకటే కంగారుపెడుతుంది.
ఆ ఉత్తరం సాంతం
అవి కూడా విన్నట్టే ఉంది.
ఇప్పుడు ఆ పిట్ట ఆ చెట్టు
మేం ముగ్గురం ఒక జట్టు.
15-4-2025
“ సాంగత్యాల మరకలు తుడిచే” వసంతాన్ని వ్రాసిన ఉత్తరం!!
“చెట్టుతో పిట్టతో జట్టు” కట్టే కాలం
“లోకానికి వీపును తిప్పేశాక” మనసులో ఒక తెరిపి.
బావుంది సర్!!
ధన్యవాదాలు మాధవీ!
Beautiful sir…❤️
ధన్యవాదాలు మానసా!
ఆ ఉత్తరం వసంత వాన చదవడం విన్నాక ఆ చెట్టు, ఆ పిట్ట మాత్రమే కాదు మీ జట్టు మేం కూడా . కవిత బాగుంది సర్
ధన్యవాదాలు సార్!
చా..లా అందంగా ఉంది సర్!వసంతవాన ఉత్తరం
ధన్యవాదాలు మేడం!