
బైరాగి కవిత్వం మీద చేపట్టిన చర్చలో భాగంగా ఇది మూడవ ప్రసంగం. మొదటి ప్రసంగంలో బైరాగి కవిత్వ తత్త్వాన్ని స్థూలంగా వివరించాను. రెండవ ప్రసంగంలో హామ్లెట్ స్వగతం కవితను పరిచయం చేయబోయేముందు షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నాటకం కథ, ఇతివృత్తం, ఆయన అందులో చర్చించిన సమస్యలు మొదలైన వాటి గురించి మాట్లాడేను. ఇప్పుడు ఈ ప్రసంగంలో బైరాగి రాసిన హామ్లెట్ స్వగతం కవితను చదివి వినిపించి, ఆ కవితలో ఆయన 16 వ శతాబ్దపు ఒక నాటకాన్ని ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సామాజిక-రాజకీయ ప్రశ్నలకు ఏ విధంగా అనుసంధానించిందీ వివరించేను.
18-1-2025