సముద్ర శాస్త్రవేత్తలు చాలా ఏళ్ళుగా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ చివరికి ఏమైతేనేం తిమింగలాల భాష కనుక్కున్నారు. భాష అంటే మొత్తం పదజాలం, వ్యాకరణం, సాహిత్యం అనీ అనుకునేరు సుమా! కాదు, మోర్సుకోడులాగా ఒక్క క్లిక్కు. ఆ తర్వాత ఏమైందో చదవండి:
తిరుపాలమ్మ
ఎం.ప్రగతి గారు హిందూపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రినిసిపాలుగా పనిచేస్తున్నారు. ఆమె రాసిన ఈ తిరుపాలమ్మ కథ పత్రికలో వచ్చినప్పుడే చదివాను. ఈ కథ 2023 లోనే వచ్చినా ఏ వార్షిక సంకలనాల్లోగాని, ఏ ప్రత్యేక కథా సంకలనాల్లోగాని మీరు చూసేరా? ఇంతకన్నా ముఖ్యమైన సామాజిక సమస్య మరేముంటుంది గనుక ఒక కథకుడు కథగా మలచడానికి?
ఒకానొక సహృదయుని ప్రేమలేఖలు..
నిన్నంతా ఒక సహృదయుడు రాసిన ప్రేమ లేఖల్ని చదివుతూ గడిపేను. ఔను అవి ప్రేమలేఖలే. ఎంతో ఆర్తితో, మరెంతో బాధ్యతతో రాసిన ప్రేమలేఖలవి. కవీ, రచయిత, చిత్రకారుడూ, పిల్లలప్రేమికుడూ అయిన ఒక భావుకుడు తాను దర్శించిన ప్రయోగాత్మక పాఠశాలలగురించి రాస్తే వాటిని ప్రేమలేఖలు అనకుండా మరేమంటాను! అని అంటున్నారు గంటేడ గౌరునాయుడు. ఎందుకో ఈ లింక్ తెరిచి చూడండి:
