ఒక గ్రామం మొత్తం పూనుకుంటేనే ఒక మనిషి విద్యావంతుడవుతాడని ఒక ఆఫ్రికన్ సామెత. ఒక నగరం మొత్తం పూనుకుంటేనే ఒక పౌరుడు విద్యావంతుడవుతాడని పూర్వకాలపు గ్రీకులు భావించేవారు. డా.కొండపల్లి శేషగిరిరావుగారి జీవితప్రయాణాన్ని దగ్గరగా చూసినవాళ్ళకి ఒక దేశం మొత్తం పూనుకుని ఆయన్ని చిత్రకారుడిగా రూపొందించిందని అర్థమవుతుంది.
