నా చంపారన్ యాత్ర-1

అక్కడ రెండు నీలిమందు మొక్కలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చంపారన్ లో 95,970 ఎకరాలమేరకు విస్తరించిన నీలిమందుతోటలు  ఇప్పుడు రెండు నమూనా మొక్కలుగా మిగిలిపోయి, ‘పేదవాళ్ళ ఆగ్రహం’ ఎంత ప్రమాదకరమైందో ఎలుగెత్తి చాటుతున్నాయనిపించింది.