ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది

అందుకనే, మునుపెన్నటికన్నా కూడా నేడు గాంధీజీ స్ఫూర్తి మనకొక సామాజిక-నైతిక అవసరంగా మారుతున్నదని గ్రహిస్తున్నాను. అహింసని మనమింకెంత మాత్రం వ్యక్తి ధర్మంగా భావించి పక్కనపెట్టలేం. అన్నిటికన్నా ముందు అది జాతిధర్మం, దేశధర్మం, ప్రపంచధర్మంగా మారవలసి ఉంది. గాంధీజీ అన్నిటికన్నా ముందు అహింసావాది, ఆ తర్వాతే జాతీయోద్యమవాది, సంస్కర్త, మరేమైనా.