నా చంపారన్ యాత్ర-4

నేనింతదాకా చూసిన ఆ ధర్మశాల ఏ ఫోటొని బట్టి కూడా అక్కడ ఒక చెరువుండేదని తెలియనే తెలియదు. అందుకనే ఒక ప్రాంతం గురించి తెలియాలంటే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఫొటోలు చూసినా సరిపోదు. స్వయంగా అక్కడకి వెళ్ళాలి, ఆ స్థానికులతో మాట్లాడాలి, మరో దారి లేదు.