వచ్చే ముందు మళ్ళా ఒకసారి ఆ మహాపర్వతశ్రేణిని, ఆ రజతశృంగ నిశ్రేణిని తనివితీరా చూసాను. దేవాలయంలో ధూపమూ, హారతీ ఇచ్చి అర్చన పూర్తయ్యాక తృప్తిగానూ, నిశ్శబ్దంగానూ నిలిచి ఉండే మూలవిరాట్టుల్లాగా ఉన్నాయి ఆ కొండలు. ఈ రోజుకి ధ్యానం, సంధ్యావందనం మాత్రమే కాదు, పూజ కూడా పూర్తయిందనిపించింది.