సరిగ్గా ఆ వైఖరిమీదనే, ఆ రాజీపడటం మీదనే సుభాష్ తన అస్త్రాల్ని ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలో ఎంతదాకా వెళ్ళాడంటే, మారిన పరిస్థితుల్లో సరికొత్త జాతీయోద్యమాన్ని నిర్మించే శక్తి గాంధీకి లేదనీ, ఒకటి ఆయన వయోభారం, రెండవది, ఆయన శాంతిదూత కావడం అని కూడా అన్నాడు. .
ఒక భారతీయ తీర్థయాత్రీకుడు
23 ఏళ్ళ ఒక యువకుడు ఇటువంటి వాక్యాలు రాసాడంటే నమ్మశక్యంగా ఉండదు. కాని ఇటువంటి వాక్యాలు రాసాడుకనుకనే మరొక ఇరవయ్యేళ్ళ తరువాత ఆయన చరమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలుపెట్టగలిగాడు.