శ్రీ అరవిందుల శతాబ్ది సందర్భంగా వెలువరించిన సమగ్రసాహిత్యంలో మొదటి 15 సంపుటాలపైనా శ్రీమతి ప్రేమా నందకుమార్ గారు రాసిన పరిచయవ్యాసలను శ్రీ చింతగుంట సుబ్బారావుగారు అనువదించారు.
శ్రీ అరవింద సరిత్ సాగర
అందువల్ల, ఆయన్ని అర్థం చేసుకోవాలంటే, హిమాలయాల అంచుల్లో విహరిస్తే చాలదు, మనం స్వయంగా ఆ పర్వతారోహణకు పూనుకోవాలి. కొన్ని అడుగులు పైకి ఎక్కామో లేదో, గాలి పీల్చడం కూడా కష్టంగా తోచే ఆ అత్యున్నతవాతావరణంలో ఎట్లానో ఒక్కొక్క అడుగే వేసుకుంటోపోవాలి. అన్నిటికన్నా ముందు ఒక సుశిక్షిత పర్వతారోహకుడి చేతుల్లో మనని మనం తర్ఫీదు చేసుకోవాలి.