కాని సత్యశ్రీనివాస్ లాంటి వాళ్ళకి అది దైనందిన సమస్య. అనుక్షణ వేదన. అతడి దృష్టిలో పర్యావరణమూ, మానవహక్కులూ వేరువేరు కావు. సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ ఒకదానికొకటి సంబంధించనవి కావు.
స్త్రీమూర్తుల వదనాలు
సత్య శ్రీనివాస్ చాలా సున్నితమైన భావుకుడు, కవి, చిత్రకారుడు, ప్రకృతి ఉపాసకుడు, క్రియాశీల కార్యకర్త- ఒక్కమాటలో చెప్పాలంటే, తపస్వి. అట్లాంటివాళ్ళు ఎక్కడ సంచరిస్తుంటే అక్కడ దీపం కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ సారి అట్లాంటి కాంతి కొందరు తల్లులమీద పడింది, మహనీయులైన స్త్రీమూర్తులు, తల్లులు,అత్తలు, అమ్మమ్మలు, నాయనమ్మలు.