నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు? అక్కడ సకలసంపదలమధ్య శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?
పుస్తక పరిచయం-18
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం మీద చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఎనిమిదవది. టాగోర్ సాహిత్యం వరకూ ఇది సమాపన ప్రసంగం కూడా.
చిత్రకారుడు టాగోర్
ఏమైతేనేం అతడు చివరికి చిత్రకారుడు కాగలిగాడు, ప్రవహించినంతకాలం అతడి వాక్యాలలోంచి కవిత ప్రవహించాక ఒక రోజు కొట్టివేతల మధ్య కొత్త రూపాలు కనిపించాయి.
