చిత్రకారుడు టాగోర్

.. which gives him the freedom to be useless and irresponsible..

Tagore

ఏమైతేనేం అతడు చివరికి చిత్రకారుడు
కాగలిగాడు, ప్రవహించినంతకాలం అతడి
వాక్యాలలోంచి కవిత ప్రవహించాక ఒక రోజు
కొట్టివేతల మధ్య కొత్త రూపాలు కనిపించాయి.

ప్రపంచం యుద్ధాలలో కూరుకుపోయినప్పుడు
అతడు రంగులతో ఆడుకోవడం మొదలుపెట్టాడు
దేశమింకా స్వతంత్రం కోసం పోరాడుతోంది
అతడప్పటికే పూర్తిగా విముక్తుడైపోయాడు.

వృద్ధాప్యం తలుపు తట్టే వేళకి తీరిక లేనంత
శైశవసంబరం. జీవించినంతకాలం ప్రజల
కోసం జీవించాక, శబ్దాల్లోంచి సుశబ్దాన్ని
ఏరవలసిన బాధ్యత నుంచి బయటపడ్డాడు.

(నీటిరంగుల చిత్రం, 2014 నుంచి)


Featured image: A painting by Tagore.

6-5-2025

6 Replies to “చిత్రకారుడు టాగోర్”

  1. అద్భుతః.. వృద్ధాప్యం తలుపు తట్టే వేళకి తీరిక లేనంత శైశవసంబరం. I yearn for this kind of twilight years. మీ పోస్టుకు జత చేసిన నీటిరంగుల చిత్రం మీరు 2014 లో వేసినదా భద్రుడు గారు. A Really Stunning Painting. Kudos to you.

    1. ఆ చిత్రలేఖనం టాగోర్ చిత్రించింది. ఆ వివరాలు పెట్టడం మర్చిపోయాను.

  2. Wah!! చేరుకోవలసిన స్థితి !! 🙏🏽

    Tagore చిత్రించిన painting గురించి చెప్పండి, సర్. 🙏🏽

    1. తప్పకుండా! శుక్రవారం ప్రసంగం అదే!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%