భగవంతుడు తన జీవితంలో కొత్తగా, సరికొత్తగా అడుగుపెట్టినట్టే, టాగోర్ కూడా అడుగుపెడుతున్నాడు, నా జీవితంలో, ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా.
రెండుపాటలు
ఇట్లాంటి ఫాల్గుణమాసాన్ని ఎన్నడూ చూడలేదు. ఇట్లా వసంత ఋతువునూ ఎప్పుడూ స్వాగతించి ఉండలేదు. అకాలంగా కాస్తున్న ఈ ఎండ, 'శిశిరవసంతాల మధ్య సంభవించే మహామధురమైన మార్పు ' ను అనుభూతిచెందటానికి వీల్లేనంత దట్టమైన తెరకప్పేసింది.