ఇక్కడ పొందుపరిచిన ‘గులాబి’ కథ చూడండి. ఇది ప్రకృతి గురించిన కథ, మనుష్య ప్రకృతి గురించిన కథ కూడా. ప్రకృతిని ప్రాకృతిక ప్రకృతి అనే అర్థం నుంచి స్వాభావిక ప్రకృతి అనే పార్శ్వంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కథ. ఈ చిన్న కథలో ఫ్రెంచి సామాజాన్ని అతలాకుతలం చేస్తున్న వైరుధ్యాలన్నీ ఎంతో కళాత్మకంగా చిత్రణకొచ్చాయి.