పొందడం, పోగొట్టుకోవడం, సంతోషం, సంతోషరాహిత్యం, సాన్నిహిత్యం, ఒంటరితనం లాంటి అత్యంత మౌలిక మానవానుభవాల్ని ఆమె తన మనసనే మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తూనే వచ్చింది. ఆమె కవిత్వం నుంచి మనకి లభించగల అతి గొప్ప ఉపాదానమిదే: ఆ కవితలు చదువుతున్నప్పుడు, మన తల్లులూ, మన తండ్రులూ మనకి కొత్తగా పరిచయమవుతారు.