ఏమి రాగాలు! ఏమి భావాలు!

చూస్తున్నంతసేపూ మనమీంచి ఆ జలపాతాలు ప్రవహించిపోతూనే ఉన్నాయి. ఆ సౌష్టవ భంగిమలు, ఆ అభినయ శుద్ధి, ఆ వాచికం, ఆ తాళధ్వని, జీవితాన్ని పరిశుభ్రపరిచి సుసంస్కృతం చేసి నీ ముందు స్వీకారయోగ్యంగా నిలబెట్టిన క్షణాలవి.

కళా సాఫల్యం

తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.