నన్నెచోడుడు తిరుగాడిన నేల

అయితే ఈ వాదవివాదాలన్నీ సద్దుమణిగాక, నన్నెచోడుడంటూ నిజంగానే ఒక కవి ఉండేవాడనీ, ఆయన కుమారసంభవమనే ఒక కావ్యాన్ని రచించిన మాట వాస్తవమేననీ తెలుగు సాహిత్య చరిత్రకారులు అంగీకరించడం మొదలుపెట్టాక కూడా, ఆయన కాలం గురించిన సందేహాలట్లానే ఉండిపోయాయి.