ఆషాఢ మేఘం ఒక సూచన, ఒక ధ్వని. ఏకకాలంలో భూమీ, ఆకాశమూ కలుసుకునే చోటు అది. భావుకుడైన ప్రతి మానవుణ్ణీ ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ రెండూ ఒక్కసారే పిలుస్తున్నప్పుడు అతడు లోనయ్యే ఉద్విగ్నతకు అద్దం పట్టే దృశ్యమది.
ఊర్వశీయం
ఈ నాటకం పైకి కనిపిస్తున్నంత సరళంగానూ సులభంగాను ఉన్న కథ కాదనీ, ఈ నాటక ఇతివృత్తంలో సార్వజనీన, సార్వకాలిక సమస్యలు లోతుగా సంక్లిష్టంగా ఉన్నాయని ఓల్గా గారు అన్నారు.
మధురవిషాద మోహగాథ
నా దృష్టిలో విక్రమోర్వశీయం కావ్యం. అందమైన, సుకుమారమైన దీర్ఘకవిత. చింగిజ్ ఐత్ మాతొవ్ రాసిన జమీల్యా లాగా అది విషాదమాధుర్యాలు కలగలిసి, చివరికి, మాధుర్యమే మనల్ని వెన్నాడే ఒక మోహగాథ.
