ఋతుపవనమేఘాలు తమ నేలల్ని తాకినప్పుడు పూర్వకాల సంగం కవులు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం కవులు సంతోషంతో పులకించిన పలవరింతల్ని కాళిదాసు మేఘసందేశంగా తీర్చిదిద్ది భారతీయ ఋతుపవనాన్ని ఒక అజరామర కావ్యంగా మార్చేసాడు.
దశార్ణదేశపు హంసలు
అట్లాసులూ, ఫొటోగ్రాఫులూ లేని కాలంలో ఈ దేశాన్ని దర్శించిండానికి కవిత్వమూ, పురాణాలూ, స్థలపురాణాలే ఆధారంగా ఉండేవి. ముఖ్యంగా కవులు తాము దర్శించి నలుగురికీ చూపించిన దేశం ఎంతో హృద్యంగానూ, ప్రేమాస్పదంగానూ ఉండేది.వారు చిత్రించిన లాండ్ స్కేప్ కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు.
