తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.
ఆషాఢమేఘం-11
ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!
ఆషాఢమేఘం -3
ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక అభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు.
