నీ సంగీతం నీదే

కవిత చదువుతున్నంతసేపూ మా ఊరూ, మా ఊరినుంచి లోపలకు వెళ్తే చింతతోపులమధ్య మెరిసిపోయే వణకరాయి గ్రామమూ, కొండచరియలమీంచి ఇంటికి మళ్ళే మేకలమందలూ, ఆకాశంతా ఆవరించే బంగారు ధూళి కళ్ళముందు కదులుతున్నాయి.