అవును. నరకాన్ని కూడా ధిక్కరించగలవి పువ్వులు మాత్రమే. వాటికి తెలుసు, జీవించేది ఒక్కరోజు మాత్రమే. వాటికి మృత్యుభయం లేదు. రేపెలా గడుస్తుందన్న చింతలేదు. ఈ సాయంకాలానికి వాడి నేలరాలిపోతామన్న దిగులు లేదు. వాటికి తెలిసింది ఒక్కటే, ఆ క్షణం, తాము విప్పారుతాయే, ఆ క్షణం, తమ సమస్త అస్తిత్వంతో, ఆనందంతో, లోపల్నుంచీ ఉబికి వచ్చే ధగధగతో, పూర్తిగా, పరవశంతో, అజేయమైన ఆత్మబలంతో, తాము తాముగా పూర్తిగా విప్పారడం. అలా విప్పారిన క్షణం అవి భూమ్మీద స్వర్గాన్ని వికసింపచేస్తాయి. ఆ తర్వాత అవి ఉంటే ఏమిటి? రాలిపోతే ఏమిటి? కనీసం ఆ క్షణం, ఆ ఒక్క క్షణం, నరకలోకం తలుపులు మూసుకుపోతాయి.
మండూకసూక్తం
జ్వరం తగ్గింది గానీ, నీరసం. బయట అకాశమంతా ఆవరించిన శ్రావణమేఘాలు. కనుచూపుమేరంతా నేలనీ, నింగినీ కలిపి ఏకవస్త్రంగా కుట్టిపెట్టిన ముసురు. రాత్రవగానే నా కిటికీపక్క వానచినుకులసవ్వడి. ఇప్పుడేదో వినవలసిన చప్పుడొకటి మిగిలిపోయింది. ఏమిటది?
ఇక్కడున్నది ఇస్సా
ప్రతి భాషలోనూ కవులకొక వంశావళి ఉంటుంది. అది రక్తసంబంధమ్మీద ఏర్పడే అనుబంధంకాదు, అక్షరసంబంధం. ప్రతి కవీ తనముందొక పూర్వకవిని ఆశయంగా పెట్టుకుంటాడు. అతడి స్థాయికి తనూ చేరాలని తపన పడతాడు, 'మందః కవి యశః ప్రార్థీ' అని కాళిదాసు అనుకున్నట్టు. త
