మాష్టారి గురించి చాలా చాలా మాట్లాడాలనుకున్నాను. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడిగా, అన్వేషిగా, అద్వైతిగా ఆయన సాగించిన ప్రయాణం గురించి చెప్పాలనుకున్నాను.
హీరాలాల్ మాష్టారు
నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.
