హరిలాల్ గాంధీ మహాత్ముడి పెద్దకొడుకు జీవితకథ

హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ పెద్దకొడుకు. మొదట్లో గాంధీ అనుయాయుడిగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. కాని అనంతరకాలంలో గాంధీ అభిప్రాయాలతో విభేదించి ఆయన మీద ధిక్కారం ప్రకటించాడు. చివరికి విషాదాంతంగా పరిణమించిన ఆ జీవితగాథను గుజరాతీలో చందులాల్ భాగుభాయి దలాల్ ఎంతో సత్యసంధతతో రచించారు.