ఇప్పుడు నీ కళ్ళకు అంజనం పూస్తాను

ఆ ముందుమాటతో కలిపి ఆ పుస్తకం ఒక జీవితకాల పారాయణ గ్రంథం. నీ జీవితపు ప్రతి మలుపులోనూ నువ్వు ఆ పుస్తకం తెరవాలి. నీ ప్రయాణంలో నువ్వెప్పుడో వదిలిపెట్టేయవలసిన బరువులింకా మోస్తూ ఉంటే ఆ పుస్తకం చెప్తుంది, నిన్ను ఎప్పటికప్పుడు తేలికపరుస్తుంది, శుభ్రపరుస్తుంది.

విముక్తుడు

ఒక మనిషి ఎలా జీవించాలని వైదిక ఋషులు, బౌద్ధ శ్రమణులు, జెన్ సాధువులు, గ్రీకు స్టోయిక్కులు, తొలి క్రైస్తవులు భావించారో అటువంటి జీవితం జీవించాడు ఆయన. స్వతంత్రుడయిన మనిషి, రాజకీయంగా మాత్రమే కాదు, బౌద్ధికంగానూ, మానసికంగానూ కూడా, విముక్తుడు ఎలా ఉంటాడో థోరో జీవితం, రచనలు రెండూ చెప్తాయి.