డొక్కాసీతమ్మా, పండిత రాయలూ

మునిఖండంగా స్థానికులు పిలుచుకునే ముంగండ గురించి చాలా కాలం కిందట భమిడిపాటి జగన్నాథరావుగారు ఒక మాట చెప్పారు: 'అక్కడి బ్రాహ్మణులు అటు వేదమూ, ఇటు కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా సమానంగా అధ్యయనం చేసినవాళ్ళు ' అని.