ప్రేమగోష్ఠి-1

'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన.

ప్రేమ గోష్ఠి

సైమన్ అండ్ షూస్టర్ పేపర్ బాక్స్ వాళ్ళ Dialogues of Plato (2010) చదివాను. ప్లేటో పేరు మీద లభ్యమవుతున్న సుమారు 41 సంభాషణల్లో, 24 దాకా ప్లేటో రచించినట్టు నిశ్చయంగా చెప్పవచ్చు. అందులో ఆయన మొదటిదశలో రాసిన 7 సంభాషణల్లో 'యుథిప్రొ','అపాలజీ, 'క్రీటో' ఈ పుస్తకంలో ఉన్నాయి.