కరికులం అంటే ఏమిటి?

అసలు కరికులం అనే పదమే currere అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దాని అర్థం 'పరుగు' అని. కానీ ఆ పరుగు మనం భావిస్తున్నట్లుగా పోటీ పందెం తాలూకు పరుగు కాదు. అది ఒక నదీ ప్రవాహం తాలూకు ఉరవడి, ఒరవడి. ఒక course. ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా పక్కకు తప్పిపోని ఋజుగతి. కరికులం అంటే అసలైన అర్థం ఒక ఋజుత్వసాధన.