కాలంలో వస్తున్న మార్పుని అందరికన్నా ముందు చిత్రకారుడు, ఆ తర్వాత సంగీతకారుడూ, ఆ తర్వాత కవీ పట్టుకుంటారు. తాత్వికుడూ, సోషియాలజిస్టూ, కాలమిస్టూ ఆ తర్వాతే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ కవి శబ్దవర్ణచ్ఛాయలతో కవిత్వం పలికేవాడూ, ఆ కవితలో ఆ భాషకే సొంతమైన స్వరాల్నీ, ధ్వనుల్నీ పట్టుకోగలిగేవాడూ అయితే, ఇంక చెప్పవలసిందేముంది!
యుగయుగాల చీనా కవిత-23
తమని స్పందింపచేసిన ఆ క్షణాల్ని ఒక కవితగా కూర్చగలిగితే ఆ మనిషి, విద్యావంతుడనీ, సాంస్కృతికంగా పరిణతి చెందినవాడనీ గుర్తు. తన అభిరుచి ఉన్నతమైందని తెలుపుకోడానికీ, తాను జీవించిన క్షణాలు చిరస్మరణీయాలూ, సామాజికంగా ప్రభావశీలాలూ అని చెప్పుకోడానికి ప్రతి మనిషీ ఉవ్విళ్ళూరేవాడు. ఆ ఉద్వేగంలో కవిగా మారేవాడు. అలా ఒకరికొకరు పంచుకున్న ఆ కవితలు అనతికాలంలో సాహిత్యంగా మారిపోయేవి.
యుగయుగాల చీనా కవిత-22
తన ముందు కాలాలకు చెందిన పరివ్రాజక కవుల్ని నమూనాగా పెట్టుకుని అతడు కవిత్వం చెప్పాడు. తావో చిన్ లాగా ప్రభుత్వోద్యోగాన్ని వదిలిపెట్టి, పల్లెకి పోయి రైతులాగా బతకాలనుకున్నాడుగాని, జీ లింగ్ యూన్ లాగా మూడు సార్లు ఉద్యోగ పరిత్యాగం చేసి, మళ్ళా మూడు సార్లు ఉద్యోగంలో చేరకుండా ఉండలేకపోయాడు.