కబీరు-4

బీజక్ లో కనబడే కబీర్ చాలా సూటి మనిషి. అందులో ఆయన తనతో తాను మాట్లాడుకోడు, లేదా దేవుడితోనో, రాముడితోనో మాట్లాడడు. నేరుగా తన కాలం నాటి సాధువుల్ని, సంతుల్ని, సజ్జనుల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. చాలాసార్లు పండితుల్ని,కాజీల్ని రెచ్చగొడతాడు, ప్రశ్నిస్తాడు, ఎండగడతాడు.