కంఠక శైల

ఆ ఊరు వెళ్ళి వచ్చి రెండు వారాల పైనే అయ్యింది గాని, రెండువేల ఏళ్ళ కిందట పూర్వసాగర తీరంలో ఓడలు లంగరు వేసినప్పుడు రోమన్ వర్తకులూ, యాత్రీకులూ రేవు దిగి ఘంటశాలలోకి నడిచి వస్తున్న దృశ్యాలే ఇంకా నా కళ్ళముందు కదలాడుతున్నాయి.