కలాం

ఒక మనిషి జీవిత సార్థక్యాన్ని జీవితకాల కృషి ఋజువు చేస్తుంది నిజమే, కాని మనీషుల విషయంలో జీవితంతో పాటు మృత్యువు కూడా ఆ సార్థక్యాన్ని రుజువు చేస్తుందనుకుంటే కలాం చివరి క్షణాలు అందుకు నిర్దుష్ట తార్కాణం.

ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం

ఒక ఉదాత్తదేశం, ఒక ఉదాత్తజాతి ఎట్లా రూపొందగలవనే ప్రశ్నని మేం పదే పదే తరచి తరచి చూశాం. చివరికి మేం చేరుకున్న నిర్ణయమేమిటంటే ఉదాత్తదేశ బీజాలు కుటుంబంలోనే ఉన్నాయని, చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగి పెద్దవాడైన వ్యక్తి మాత్రమే జాతి పట్ల తన బాధ్యత గుర్తుపట్టగలుగుతాడు

మంగాదేవి మా అమ్మ

పిల్లల చిట్టి ప్రపంచం ఏ బుల్లి బుల్లి కలలపోగుల్తో నేసుకోవాలో, పిచికలు అల్లుకున్న గూడులాగా ఒక బడి ఎట్లా అల్లుకోవాలో ఆ వికాసరహస్యం మంగాదేవిగారికి మటుకే తెలుసనిపిస్తుంది.