ఎమెస్కో ప్రచురించిన ఈ గ్రంథాన్నిడా.పి.వి.నరసింహారావు ఆవిష్కరించారు. ఈ అనువాదానికి 2008 కు గాను ఉత్తమ అనువాదంగా కేంద్రసాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది.
ఎవరికీ తలవంచకు
సరాసరి తన హృదయాని చీల్చుకు వచ్చే సరళవాక్యాలతో జాతి జీవితం పట్ల తన మమేకత్వాన్ని మనతో కలాం పంచుకోవడం ఈ పుస్తకం సారాంశం. మానవ, జాతీయ, గ్లోబల్ అంశాలెన్నిటిపైనో కలాం మదిలో చెలరేగిన భావాల సమాహారం ఈ పుస్తకం. సరాసరి మన ఎదురుగా నిలబడి మన కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుండే మంత్రమయవాక్యాల సంపుటం ఈ పుస్తకం.
ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం
'ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం' డా. కలాం, ఆచార్య మహాప్రజ్ఞ అనే జైన సాధువుతో కలిసి రాసిన The Family and the Nation కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం.